అదృష్టవంతుడి పరిస్థితి
అదృష్టవంతుడి పరిస్థితి
ఊరక వచ్చుఁబాటుపడిన కుండిననై న ఫలం బదృష్టమే
పారఁగఁగల్గువానికిఁబ్రయాసము నొందిన దేవదానవుల్
వార లటుండగా నడుమ వచ్చిన శౌరికిఁగల్గెగాదె శృం
గారపుఁబ్రోవు లచ్చియును గౌస్తుభరత్నము రెండు భాస్కరా!
అమృతం కోసం దేవదానవులు నానా కష్టాలు పడి సముద్రమధనాన్ని సాగిస్తే అందులోంచి వెడలిన లక్ష్మీదేవి, కౌస్తుభమణీ విష్ణుమూర్తికి దక్కాయి కదా! అలాగే అదృష్టం తోడున్నవాడికి ఇతరుల ప్రయాస కూడా కలిసివస్తుంది.