పనికిమాలిన పనులు చేస్తే
పనికిమాలిన పనులు చేస్తే
తనకు తగని పిచ్చి పనులకు పోనేల
అడుసు త్రొక్కి కాలు కడుగుటేల
కోతి మేకు పీకి కోల్పోయె ప్రాణాలు
లలితసుగుణజాల! తెలుగుబాల!!తనకు మాలిన పనికిమాలిన పనులు చేసేందుకు ఉత్సాహపడటం వల్ల నష్టమే కానీ లాభం ఉండదు. బురద తొక్కడం ఎందుకు కాళ్లు కడుక్కోవడం ఎందుకు. ఇలాంటి పనుల వల్ల లాభం ఎలాగూ కలగకపోగా... ఒకోసారి మెడకు చుట్టుకునే ప్రమాదం కూడా లేకపోలేదు. అనగనగా ఓ కోతి కంటికి చీలిన చెక్క ఒకటి కనిపించింది. తన మానాన తను పోకుండా ఆ చెక్క మధ్యలో ఉన్న మేకుని లాగింది. అంతే! ఆ కోతి తోక కాస్తా చెక్క మధ్యలో ఇరుక్కుపోయి తన ప్రాణాలనే కోల్పోయింది