భద్రాచలం పేరు అలా వచ్చింది

 

 

భద్రాచలం పేరు అలా వచ్చింది

 

 

తెలుగునాట శ్రీరామనవమి అంటే భద్రాచలమే గుర్తుకువస్తుంది. ఇక్కడ జరిగే సీతారాముల కళ్యాణోత్సవం దేశమంతటికీ కన్నులపండుగే! స్థలపురాణం ప్రకారం రాములవారు సీతమ్మను వెతుక్కుంటూ ఇక్కడ భద్ర అనే మహర్షిని కలుసుకున్నారట. భద్ర మహర్షి ఆతిథ్యాన్ని అందుకున్న స్వామి, తాను సీతమ్మను రక్షించిన పిదప, తిరిగి అటువైపుగా వచ్చి పునర్దర్శనాన్ని అందచేస్తానని భద్ర మహర్షికి మాట ఇచ్చారట. అయితే రావణసంహారం తరువాత రాములవారు ఆ మాటే మర్చిపోయి వేరే బాట పట్టారు.

 

కానీ భద్ర మహర్షి మాత్రం రాములవారి కోసం ఎదురుచూస్తూ తపస్సుని ఆచరిస్తూనే ఉన్నారు. రోజులు మారాయి, ఏళ్లు గడిచాయి... రామావతారం సమాప్తి చెందింది. కానీ భద్రుని తపస్సు మాత్రం కొనసాగుతూనే ఉంది. రామావతారాన్ని చాలించి విష్ణువుగా వైకుంఠంలో ఉన్న రాములవారికి అకస్మాత్తుగా ఓ రోజు భద్రుడు జ్ఞాపకం వచ్చాడు. అంతే సీతాలక్ష్మణసమేతుడై పరుగుపరుగున భ్రదుని కలుసుకునేందుకు దిగివచ్చాడు. భద్రునికి దర్శనమిచ్చిన రాముడు అతని కోరిక మేరకు అక్కడే వెలిశాడు. అదే భద్రాచలం!

...Nirjara