శ్రీరామ నవమి రోజు ఈ పరిహారాలు పాటిస్తే ఎన్ని సమస్యలు దూరం అవుతాయో..!
శ్రీరామ నవమి రోజు ఈ పరిహారాలు పాటిస్తే ఎన్ని సమస్యలు దూరం అవుతాయో..!
శ్రీరామ నవమి అంటే పండుగ. శ్రీరాముడి జన్మదినం ఈ రోజు. రాముడు ఆదర్శ పురుషుడు, ఏకపత్నీ వ్రతుడు, పితృ వాక్య పరిపాలకుడు. పురాణాలు, పండితులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీరామ నవమి రోజు సీతారామచంద్రులను పూజించడం అందరికీ తెలిసిందే. ఈ రోజు రాముల వారి కళ్యాణం కూడా వైభవంగా జరుగుతుంది. తెలంగాణలో భద్రాచలం, ఆంధ్రప్రదేశ్ లో ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం ఎంతో ఘనంగా జరుగుతుంది. అయితే శ్రీరామ నవమి రోజు సీతారాములను కొన్ని ప్రత్యేక పద్దతులలో పూజించడం వల్ల చాలా రకాల సమస్యలు పరిష్కారం అవుతాయని పండితులు చెబుతున్నారు.
ధనలాభం కోసం..
ఆర్థికంగా బలంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే ధనలాభం కలగడానికి శ్రీరామ నవమి రోజు సాయంత్రం ఒక గిన్నెలో నీటిని తీసుకుని రామ రక్షా మంత్రాన్ని" ఓం శ్రీం హ్రీం క్లీం రామచంద్రాయ శ్రీం నమః" అనే మంత్రాన్ని108సార్లు జపించాలి. జపం పూర్తీ అయిన తరువాత ఈ జలాన్ని ఇంటి నలుమూలల్లో చల్లాలి. ఇలా చేస్తే ఆర్థికంగా బలపడతారు.
సంతానం కోసం..
సంతానం కావాలని అనుకునేవారు శ్రీరామ నవమి రోజు ఒక మంచి పరిహారం చేయవచ్చు. ఈ రోజు ఒక ఎర్రని వస్త్రం తీసుకోవాలి. ఈ ఎర్రని వస్త్రంలో ఒక కొబ్బరికాయను ఉంచి చుట్టాలి. దీన్ని సీతాదేవికి సమర్పించాలి. అనంతరం "ఓం నమః శివాయ" అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేస్తే సంతానం కలుగుతుందని అంటారు.
ఆనందం, శాంతి కోసం..
ఇంట్లోనూ, జీవితంలోనూ ఆనందం, శాంతి చేకూరాలంటే శ్రీరామ నవమి రోజు పరిహారం చేయవచ్చు. ఈ రోజు శ్రీరామ చంద్రుని దేవాలయం సందర్శించాలి. దేవాలయంలో ధ్వజస్తంభం ఉంటుంది. ఈ ధ్వజస్తంభం ఎదురుగా నెయ్యి కానీ, నూనె కానీ ప్రమిదలో వేసి దీపం వెలిగించాలి. ఆ తరువాత "శ్రీరామ్ జై రామ్ జై జై రామ్" అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
ఆరోగ్యం..
ఆరోగ్యం బాగుండాలన్నా, ఆరోగ్య సమస్యలు తీరాలన్నా శ్రీరామ నవమి రోజు సాయంత్రం హనుమంతుడి ఆలయాన్ని సందర్శించాలి. అక్కడికి వెళ్లాక దేవుడి సమక్షంలో హనుమాన్ చాలీసా పఠించాలి. తరువాత "ఓం హనుమమతే నమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేస్తే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది.
వివాహంలో అడ్డంకులు..
వివాహంలో అడ్డంకులు ఎదురవుతూ వివాహం జరగడంలో ఇబ్బందులు వస్తుంటే శ్రీరామ నవమి రోజు సాయంత్రం సీతారాములకు పసుపు, కుంకుమ, గంధం.. మొదలైనవి సమర్పించి "ఓం జై సీతారామ్" అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేస్తే వివాహ యోగ్యం వస్తుందట.
*రూపశ్రీ