అది వారి సహజగుణము

 

 

అది వారి సహజగుణము

 

 

తరువులతి రస భార గురుత గాంచు

నింగి వ్రేలుచు నమృతమొసంగు మేఘు

డుద్ధతులు గారు బుధులు సమృద్ధిచేత

జగతి నుపకర్తలకు నిది సహజగుణము

నిండా కాసిన చెట్టు, దారిన పోయేవారికి తన పండ్లను అందించేందుకా అన్నట్లు... భారంగా కిందకి వంగుతుంది; ఎక్కడో గగనసీమలో విహరించే మబ్బులు వర్షించాక కానీ తృప్తిని పొందవు; సిరిసంపదలు ఎంత ఉన్నా కానీ తెలివికల్గినవారు గర్వించరు. లోకానికి ఉపకారం చేసేవారికి ఇవి సహజమైన లక్షణాలు.