Read more!

Beejakshara Meaning - 1

 

ప్రతీ అక్షరం దైవానికి సంకేతం

బీజాక్షరాలు - 1

Beejakshara Meaning - 1

 

మహాశివుడు తాండవం చేస్తూ డమరుకం మోగించగా ''ఓం.. హ..య..వ..ర..ట్..ఏ..ఓ..'' అంటూ ధ్వనులు వెలువడ్డాయట. ఆ ధ్వనులే అక్షరాలుగా రోపొందాయి. ఆవిధంగా డమరుకం నుంచి అక్షరాలు ఏర్పడి, క్రమంగా సంస్కృత భాష రూపొందిందని చెప్తారు. అక్షరాలే లేకుంటే వేల సంవత్సరాలు గడిచినా అంధకారంలోనే ఉండేవాళ్ళం. అక్షరాలు మన పాలిట వరాలు. అక్షరం దైవస్వరూపం. సంస్కృతంలో ప్రతి అక్షరం అర్ధవంతం, అమూల్యం.

 

ప్రతి అక్షరాన్ని అర్ధవంతంగా ఉచ్చరించాలి. ముఖ్యంగా మంత్రాలు ఉచ్చరించే టప్పుడు బీజాక్షర నిగూఢ అర్ధాలను తెలుసుకుని సాధన చేయాలి.

 

ఇప్పుడు అచ్చుల్లో ''అ'' నుండి హల్లుల్లో ''ణ'' వరకూ ఆయా అక్షరాల్లో దాగివున్న అర్ధం ఏమిటో తెలుసుకుందాం.

 

అ - అక్షరం, విష్ణువు, స్వరం, హ్రస్వం, లలాటం

ఆ - నారాయణుడు, దీర్ఘం, ముఖం

ఇ - మాధవుడు, సూక్ష్మం, కుడికన్ను

ఈ - గోవిందుడు, త్రిమూర్తులు, మాయ, లక్ష్మి, శాంతి, వైష్ణవి, ఎడమకన్ను

ఉ - శివుడు, ప్రణవం, విష్ణువు, కుడి చెవి

ఊ - మధుసూదనుడు, అర్ఘీశ, ఎడమచెవి

ఋ - త్రివిక్రముడు, ముక్కు కుడిభాగం

ౠ - వాణి, ఊర్ధ్వముఖి, శ్రేష్ఠ, ముక్కు ఎడమ భాగం, శ్రీధర, స్థాణువు, శుద్ధం, మేధ, కమల, హర్ష, హృషీకేశ, శుచి

ఏ - పద్మనాభ, మహేశ, విజయ, మోహిని

ఐ - లజ్జ, దామోదర, పరా, జ్ఞానామృత

ఓ - సద్యోజాత, వాసుదేవ, గాయత్రి, బీజాకర్షిణి

ఔ - సంరక్షణ, మను, జ్వాల, ఆత్మాకర్షిణి

అం - బిందు, ప్రద్యుమ్న, శీర్ష, వియత్

అః - అనిరుద్ధ, కళ, సోమ, సుందరి

క - ముఖం, బ్రహ్మ, చక్రి, రవి

ఖ - ఆకాశ, గరుడ, శూన్య, ప్రచండ

గ - గౌరి, గంగ, గణేశ, సర్వసిద్ధి

ఘ - ఖడ్గి, వరుణ, సందేశ, మేధ

ఙ - రుద్ర, శంఖి, నీలకంఠ, మంత్రశక్తి

చ - పుష్కర, సుదర్శన, ఆత్మశక్తి, లక్ష్మి

ఛ - సుషుమ్న, పశుపతి, నిర్మల, విలాసిని

జ - శాలి, వానర, హంస, తేజ

ఝ - నాద, జిహ్వ, స్థితి, రూప

ఞ - బోధిని, కౌమారి, బుద్ధి, ధర్మ

ట - ముకుంద, కపాలి, పృథ్వి, వారుణి

ఠ - మంజరి, శశి, భీమ, జటిల

డ - స్మృతి, క్షమ, శాంతి, నంది

ఢ - ఈశ్వరి, విశాఖ, బుద్ధి, వినాయక

ణ - నిర్గుణ, జ్రుంభణ, నిష్కల, శంఖిని

 

beejakshara, beejakshara list, beejakshara meaning, beejakshara mantra, sanskrit alphabets from damarukam