Chandra Grahan, Total Lunar Eclipse
చంద్రగ్రహణ సమయం - తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Chandra Grahan, Total Lunar Eclipse
ఈరోజు మార్గశిర పౌర్ణమి. భారత కాలమానం ప్రకారం ఈరోజు (డిసెంబర్ 10వ తేదీ) సాయంత్రం 6.16 నిమిషాలకి సంపూర్ణ చంద్రగ్రహణం (Total Lunar Eclipse) మొదలై 9.48 నిమిషాల వరకూ ఉంటుంది. నాసా (NASA) కేంద్ర సమాచారాన్ని అనుసరించి ఇండియా, దుబాయ్, ఖతర్, ఒమన్, బెహ్రాన్, సౌదీ అరేబియా, నేపాల్, శ్రీలంక, సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, అమెరికా దేశాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం (Total Lunar Eclipse ) ఉంటుంది. రాత్రి 7.36 నుండి 8.37 వరకూ చంద్రుడు పూర్తిగా కప్పివేయబడతాడు. భారత్ లో అన్ని ప్రాంతాల్లో ఇలాగే ఉంటుంది.
ఎంత చలిగా ఉన్నప్పటికీ గ్రహణానికి ముందు, గ్రహణం విడిచిన తర్వాత తప్పక స్నానం చేయడం ఆచారం. గ్రహణ సమయంలో విష్ణు సహస్రనామం లేదా ఇతర మంత్రాలు చదువుతారు. కొందరు అష్టాక్షర మంత్రం లేదా మృత్యుంజయ మంత్రం పఠిస్తారు. గర్భిణీ స్త్రీలు సంతాన గోపాల మంత్రాన్ని పఠిస్తారు.
చంద్రగ్రహణం ఎలా ఏర్పడుతుంది?
భూమి తనచుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతుంది కదా! అలా తిరిగే క్రమంలో భూమి, సూర్య చంద్రుల మధ్యలోకి వస్తుంది. అలా చంద్రునిపై భూమి నీడ పడినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అంటే, సూర్యుడు, చంద్రుడు, భూమి సరళరేఖలా ఏర్పడినప్పుడు చంద్రగ్రహణం వస్తుంది. ఈ చంద్రగ్రహణం పౌర్ణమి రోజున వస్తుంది.
చంద్రగ్రహణం సమయంలో భూమి నీడ చంద్రుని కప్పివేస్తుంది. దాంతో చంద్రునిలో కొంతభాగం దట్టమైన నీడలా, నల్లగా కనిపిస్తుంది. సూర్యునికి, చంద్రునికి మధ్యలో వచ్చిన భూమి ఎడమవైపు సగభాగంలో నివసించేవారికి చంద్రగ్రహణం కనిపిస్తుంది. గ్రహణం అన్ని ప్రాంతాలవారికీ కనిపించదు. గ్రహణం కనిపించినా, కనపడకపోయినా దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. కనుక గ్రహణ సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి.
చంద్రగ్రహణం సమయంలో పాటించాల్సిన నియమాలు...
* గ్రహణ సమయంలో దైవ ప్రార్ధన చేసుకోవాలి.
* గురు మంత్రాన్ని స్మరించుకోవడం మంచిది.
* ఆ సమయంలో యాదృచ్చికంగా సాధుసన్యాసులు ఎవరైనా తారసపడితే వారికి భక్తిగా నమస్కరించుకోవాలి.
* గ్రహణ సమయంలో ఏమీ తినకపోవడం మంచిది.
* గ్రహణం విడిచేవరకూ నిద్రించకూడదు.
* గ్రహణ సమయంలో స్త్రీపురుష సమాగమం తగదు.
* ప్రత్యేకమైన కళ్ళజోడు పెట్టుకుని మాత్రమే గ్రహణాన్ని చూడాలి. తిన్నగా గ్రహణాన్ని చూస్తే కంటిచూపు దెబ్బతినే అవకాశం ఉంది.
* గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఎక్కడికీ వెళ్ళకూడదు. ఇంట్లో కూడా కదలకుండా పడుకోవాలి.
* గ్రహణం విడిచిన తర్వాత ఇల్లు శుభ్రం చేసుకోవాలి. తర్వాత స్నానం చేయాలి.
గ్రహణానంతరం నది లేదా కాలువలో స్నానం చేయగలిగితే శ్రేష్టం.
రుద్రాక్ష ధరించడానికి చంద్రగ్రహణ సమయం మంచిది.
గ్రహణ సమయంలో పాదరస శివలింగాన్ని దర్శించుకున్నట్టయితే ఆర్ధికాభివృద్ధి ఉంటుంది. అనారోగ్యాలు నశిస్తాయి. ఎలాంటి కలతలూ, కల్లోలాలూ దరిచేరవు.
Total Lunar Eclipse, Lunar Eclipse in India, Lunar Eclipse NASA report, Lunar Eclipse in USA, Lunar Eclipse-2012