Ashta Vasuvulu

 

అష్టవసువులు

Ashta Vasuvulu

 

గంగాదేవికి, శంతనుడికీ జన్మించిన ఎనిమిది మంది కుమారులు అష్టవసువులు.శాపవశాత్తు వీరు మానవ జన్మ ఎత్తవలసి వచ్చింది.

అష్టవసువుల అసలు పేర్లు ఆపుడు, ధృవుడు, సోముడు, ధరుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యుషుడు, ప్రభాసుడు. ఒకసారి అష్టవసువులు వసిస్టుని ఆశ్రమానికి వెళ్ళి, అక్కడ కామధేనువు వంటిదైన నందిని అనే ఆవును చూసి, అది తమకు కావాలని కోరారు. వసిష్టుడు దీనికి తిరస్కరించడంతో దానిని అపహరించాలని అష్టవసువులు భావించారు. ప్రభాసుని నాయకత్వంలో ఆ ఆవును అపహరించేందుకు ప్రయత్నించగా, వశిష్టుడు అది తెలుసుకుని, భూలోకంలో జన్మించమని శపిస్తాడు.

అష్టవసువులు శాపవిమోచనం కోసం వేడుకోగా, గంగకు జన్మించిన అష్టవసువులలో ప్రభాసుడు మినహా మిగిలిన వారందరూ వెంటనే మరణించి తిరిగి పూర్వరూపానికి వస్తారని, ఎక్కువ పాపం (గోవును అపహరించేందుకు యత్నం) చేసిన ప్రభాసుడు చిరకాలం జీవించి, చివరికి యధారూపానికి వస్తాడని వశిష్టుడు శాపవిమోచన మార్గం చెబుతాడు.

ప్రభాసుడు మినహా మిగిలిన వారందరూ పుట్టగానే మరణించగా, ప్రభాసుడు ఎక్కువకాలం జీవిస్తాడు. అతడే భీష్ముడు.