ఒట్టినేలపై ఎందుకు కూర్చోకూడదు? (Should not sit on Floor)

 

ఒట్టినేలపై ఎందుకు కూర్చోకూడదు?

(Should not sit on Floor)

కూర్చునేటప్పుడు ఏదో ఒక ఆసనం వేసుకుని కూర్చోవాలని, కటికనేలమీద కూర్చోకూడదు అని పెద్దలు చెప్పారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

 

కూర్చోడానికి కుర్చీ, పీట, మంచం - ఇలా ఏదో ఒక ఆసనాన్ని ఉపయోగించాలి. ఆసనం అనేది అనేక రకాలుగా చేయబడుతుంది. చెక్కతో తయారయ్యే పీట మొదలైన ఆసనాలు, ఈతాకు, తాటాకు, జనపనార తదితరాలతో తయారయ్యే చాపలు, ఉన్ని, నూలు తదితరాలతో రూపొందే వస్త్రాలు, దర్భాసనం, జింక చర్మం, పులిచర్మం, లోహంతో రూపొందిన ఆసనం - ఇలా అనేకం ఉన్నాయి. కూర్చునేటప్పుడు వీటిల్లో ఏదో ఒకదానిపై కూర్చోవాలి. అంతే తప్ప ఏ ఆసనమూ లేకుండా ఒట్టి నేలమీద కూర్చోకూడదు.

 

కటికనేల మీద ఎందుకు కూర్చోకూడదు అంటే...

మన శరీరంలో నిరంతరం విద్యుత్తు ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే ఉత్పత్తి అయిన విద్యుత్తు బయటకు పోతూ ఉంటుంది. ఉత్పత్తి అయ్యే, వెలుపలికి పోయే విద్యుత్తు సమతూకంలో ఉండాలి. అందులో హెచ్చుతగ్గులు ఉంటే అనారోగ్య సమస్యలు వస్తాయి.

 

ఒక ఆసనం మీద కూర్చోవడాన మన శరీర ఉష్ణోగ్రత సమానంగా ఉంటుంది. ఇందుకు విరుద్ధంగా ఒట్టినేలమీద కూర్చున్నప్పుడు శరీరంలో ఉత్పత్తి అయ్యేదాని కంటే ఎక్కువ విద్యుత్తు బయటకు పోతుంది. యోగాసనం వేసేటప్పుడు చాప లేదా పులిచర్మాన్ని ఉపయోగించాలి. ఒట్టినేలపై కూర్చోకూడదు అని శాస్త్రం చెప్తోంది. పూజ చేయడానికి, అన్నం తినడానికి, ప్రవచానానికి, మామూలుగా కాలక్ష్యేపానికి, విశ్రాంతి తీసుకోడానికి ఇలా రోజులో అనేక సందర్భాల్లో అనేక రకాలుగా కూర్చుంటాం.