రత్నాల్లో 84 రకాలు (84 Types of Precious Stones)

 

   రత్నాల్లో 84 రకాలు

 

(84 Types of Precious Stones)

   పసిడి ధర ఆకాశాన్ని అంటుతోంది. రత్నాల వెల కూడా అంతే. రత్నాలు విలువైనవే కాదు, అమూల్యమైనవి. బంగారం ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. కానీ, రత్నాలు కేవలం అందం, అలంకరణ కోసమే కాదు. రత్నాలు ధరంచడం వల్ల గ్రహానుగ్రహం కలుగుతుంది. వివిధ గ్రహాల స్థితిగతులు అనుకూలంగా మారతాయి. రత్నాలను మనకు తోచినట్లు ధరించకూడదు. తమ జాతకచక్రాల ప్రకారం ఏ రత్నం మంచిదో తెలుసుకుని దాన్ని ధరించాలి. అనుకూలం కాని రత్నాలను ధరించడం వల్ల మేలు జరగకపోగా, కీడు వాటిల్లే ప్రమాదం ఉంది. ముఖ్యంగా నీలం కొద్దిమందికి మాత్రమే ప్రయోజనం చేకూరుస్తుంది. చాలామందికి హాని చేస్తుంది. కనుక రత్నాలు కొనుక్కోగలికే శక్తి ఉంటే సరిపోదు, మనకు ఏది మంచిదో తెలుసుకోవడం చాలా అవసరం.

 అసలు రత్నాలు ఎన్నో, ఏమిటో చూద్దామా...

వినుము మాణిక్య మౌక్తిక విద్రుమములు

 గరుడ పచ్చయు పుష్యరాగంబు వజ్ర

 నీల వైడూర్య గోమేధికంబు లనంగ

 వెరయు తొమ్మిది నవరత్నములంద్రు

 1. మాణిక్యం 2. ముత్యం 3. పగడం 4. పచ్చ 5. పుష్యరాగం 6. వజ్రం 7. నీలం 8. వైడూర్యం 9. గోమేధికం - ఇవీ నవ రత్నాలు. మాణిక్యాన్ని కెంపు అని కూడా అంటారు.

నవ రత్నాలని ఇంగ్లీషులో ఇలా వ్యవహరిస్తారు.

 

1. మాణిక్యం - Ruby

2. ముత్యం - Pearl

 

3. పగడం -Coral

 

4. పచ్చ - Gold Topaz

 

5. పుష్యరాగం - Emerald

 

6. వజ్రం - Diamond

7. నీలం - Sephire

 

8. వైడూర్యం - Cat's Eye

 

9. గోమేధికం - Fagmatite

 

బాగా ప్రసిద్ధమైనవి, ఎక్కువమంది ఉపయోగించేవి ఈ నవరత్నాలనే అయినప్పటికీ ఇంకా ఇతర జాతి రత్నాలు కూడా ఉన్నాయి. అవి 22 ఉన్నాయి.

    1. పద్మరాగం 2. ముత్యం 3. పగడం 4. పచ్చ 5. వజ్రం 6. పుష్యరాగం 7. ఇంద్రనీలం            8. కార్కేధన  9. రుద్రాక్ష 10. వైడూర్యం 11. విపులం 12. విమలక 13. రాజమణి                14. స్ఫటికం 15. సౌగంధికం 16. చంద్రకాంతమణి 17. గోమేధికం 18. సంగమమణి           19. మహానీలం 20. బ్రహ్మమణి 21. జ్యోతిషమణి 22. శేవ్యగం

 

- 22 మాత్రమే కాదు. మరో 84 రకాల రత్నాలు కూడా వాడకంలో ఉన్నాయి. వాటిని ఉపరత్నాలు అంటారు.

 

"పురుషులందు పుణ్య పురుషులు వేరయా" అన్నట్టు మామూలు మగవారిలో మంచివాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అనేక రకాల పిచ్చి రాళ్ళు రత్నాల్లాగే మెరుస్తూ ఉంటాయి. తెల్లటివన్నీ పాలు కావు, మెరిసేదంతా బంగారం కాదు చందంగా ప్రకాశవంతంగా భాసించినంత మాత్రాన అన్ని రాళ్ళూ రత్నాలు కావు. ఫలానా రత్నాన్ని ధరించమని జాతిరత్నాలపై అవగాహన ఉన్న పండితుడు చెప్పినంతలో షాపుకు వెళ్ళి కొనుక్కోవడం వల్ల ఉపయోగం లేదు. జాతి రత్నాల గురించి అవగాహన ఉన్నవారిని వెంట తీసికెళ్ళి కొనుక్కోవడం ఉత్తమం. అప్పుడే ఆశించిన సత్ఫలితాలు నెరవేరతాయి