ఎరుపు రంగు చేసే మేలు (Importance of Red Colour)

 

ఎరుపు రంగు చేసే మేలు

(Importance of Red Colour)

 

ప్రపంచమంతా రంగులతో నిండి ఉంది. రంగుల్లేని లోకం మన ఊహలకు అందడు. దేన్ని తలచుకున్నా ఏదో ఒక రంగు మన కళ్ళముందు నిలుస్తుంది. రంగులకు చాలా ప్రాధాన్యత ఉంది. అందులో ఒక్కో వర్ణం కొన్నిటిని ప్రతిఫలిస్తుంది. కొన్ని ప్రయోజనాలను సమకూరుస్తుంది.

 

ఎరుపు రంగునే తీసుకుంటే రక్తం ఎర్రగా ఉంటుంది. సంధ్యాసమయం ఎరుపు. ఎరుపు ఆధారచక్రానికి సంబంధించింది. దాంతో మూత్రాశయం, మూత్రపిండాలపై ఎరుపు రంగు ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

 

ఎరుపు రంగుతో అప్రమత్తంగా ఉంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఎరుపు ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇస్తుంది. బలాన్ని, శక్తిని సమకూరుస్తుంది. స్థిరత్వాన్ని కలిగిస్తుంది. నిశ్చింతగా, నిబ్బరంగా ఉండేలా చేస్తుంది.

 

ఎరుపు రంగులో తేజస్సు ఉంటుంది. ఇది ప్రేమకు, దయకు సంకేతం. ఎర్రటి వస్త్రాలు ధరించేవారు ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. ఎప్పుడూ చలాకీగా కనిపిస్తారు. ఎరుపును ఇష్టపడని వారిలో సోమరి గుణం ఉంటుంది. ఎరుపు వస్త్రాలకు దూరంగా ఉండేవారు నిరుత్సాహంగా కనిపిస్తారు.

 

ఒక్కో వర్ణానికి ఒక్కో విధమైన ప్రయోజనం ఉంటుంది. అలా కలర్ థెరపీలో ఎరుపురంగువల్ల రక్త హీనత తగ్గుతుంది. వాత లక్షణాలు తగ్గుతాయి. జలుబు, జ్వరాలు నయమౌతాయి. తడి దగ్గు, పొడి దగ్గు, టీబీ, పైల్స్, పెరాల్సిస్, లాంటి వ్యాధులను ఎరుపురంగు నివారిస్తుంది. ఎరుపు కళ్ళ కలకను కూడా నివారిస్తుంది. ఆఖరికి పాండురోగం, గుండె జబ్బులు సంధి లాంటి క్లిష్ట జబ్బులు సైతం ఎరుపు రంగుతో నయమౌతాయి. చేతులు కాళ్ళు చచ్సుబాడటం, చల్లబడటం, కడుపులో మందంగా ఉండటం మొదలైన అనేక సమస్యలకు ఎరుపు రంగుతో స్వస్తత చేకూరుతుంది.