సరైన ఫలితం దక్కాలంటే ఆదిత్య హృదయాన్ని ఇలా పఠించాలి..!

 

సరైన ఫలితం దక్కాలంటే ఆదిత్య హృదయాన్ని ఇలా పఠించాలి..!

 


సూర్యుడిని ప్రత్యక్ష దైవం అని పిలుస్తారు.  ప్రతి ఆదివారం సూర్యుడిని పూజించడం చాలా ప్రాముఖ్యత సంతరించుకుని ఉంటుంది. ముఖ్యంగా సూర్యుడి అనుగ్రహం కోసం అర్ఘ్యం సమర్పించడం,  ఆదిత్య హృదయం పఠించడం చేస్తుంటారు. అయితే సూర్యుడి అనుగ్రహం కోసం..  సరైన ఫలితాలు దక్కాలన్నా ఆదిత్య హృదయాన్ని  పఠించే విధానం కూడా ముఖ్యం.  ఇంతకీ ఆదిత్య హృదయం ను ఎలా పఠించాలో తెలుసుకుంటే..


సూర్యుని అనుగ్రహం పొందాలంటే 7 ఆదివారాలు ఆదిత్య హృదయాన్ని పఠించడం చాలా ముఖ్యం.  ప్రతి ఆదివారం ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఆ తరువాత సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. దీని వల్ల సూర్యుడి అనుగ్రహం మెండుగా ఉంటుంది.  దీని తరువాత అర్ఘ్యం సమర్పించిన చోట నిలబడే ఆదిత్య హృదయం స్తోత్రాన్ని పఠించాలి.  ఆదిత్య హృదయం పఠించిన తరువాత సూర్యునికి హారితి ఇవ్వాలి.  తదనంతరం మనసులో ఉన్న కోరికలను ఆ సూర్య భగవానుడికి విన్నవించుకోవాలి.  ఈ విధంగా 7 ఆదివారాల పాటూ చేస్తుంటే సూర్యుడి అనుగ్రహం కలిగి కోరికలన్నీ తీరతాయి. అంతేకాదు..  సూర్యుడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. సూర్యుడి లాంటి తేజస్సు సొంతం అవుతుంది.  గ్రహాల దోషాలు ఉంటే తొలగిపోతాయి. కేవలం ఆరోగ్యం మాత్రమేకాదు.. జీవితంలో ఉన్నతి, సంపద, కీర్తి అన్ని ప్రాప్తిస్తాయి.


                                                 *రూపశ్రీ.