యోగాభ్యాసం వల్ల కలిగే ప్రయోజనాలు
posted on Jun 5, 2013
యోగాభ్యాసం వల్ల కలిగే ప్రయోజనాలు
ఈనాటి కాలంలో యోగ విద్యకు సైన్స్ సాయం కూడా లభించింది. పలువురు మేధావులు,
డాక్టర్లు, నిపుణులు ఈ రంగంలో ప్రవేశించి శారీరక, మానసిక వికాసానికి దోహదం చేసే
విధంగా యోగ శాస్త్రాన్ని మలిచి యోగ చికిత్సా విధానం ప్రారంభించి మానవాళికి
మహోపకారం చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. అలాంటి యోగాభ్యాసం వల్ల కలిగే
ప్రయోజనాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
* శారీరకంగా, మానసికంగా సుఖశాంతులు, ఆరోగ్యం పొంది ఆత్మవికాసం పెరుగుతుంది.
* ఈర్ష్య, ద్వేషం, అసూయ, ఆవేశం, ఇలా మొదలయిన రాక్షస గుణాలు పోయి ప్రేమ,
అనురాగం, ఆప్యాయతలు చోటు చేసుకుంటాయి.
* మధుమేహం, ఆస్తమా, రక్తపుపోటు, గుండెనొప్పి, నడుం నొప్పి, మోకాళ్ళ నొప్పి, అజీర్తి
మొదలయినా గల దీర్ఘకాలిక రోగాలు నయమై మనిషిని ఉత్సాహవంతులని చేస్తుంది.
* యోగాభ్యాసం చేయడం వల్ల ఆరోగ్యం పొందడమే కాదు అందం కూడా పెంచుకోవచ్చు.
* యోగాభ్యాసం చేస్తే నిత్య కార్యక్రమాలలోను, ఆఫీసులో చేసే పనుల్లో దక్షత, ఏకాగ్రత, చురుకుదనం వస్తుంది.