చిన్నవయసులోనే పీరియడ్స్ వస్తే డేంజరా...ఆడపిల్లల తల్లులు తెలుసుకోవాల్సిన విషయం..!

 

చిన్నవయసులోనే పీరియడ్స్ వస్తే డేంజరా...ఆడపిల్లల తల్లులు తెలుసుకోవాల్సిన విషయం..!

 


పీరియడ్ అనేది సహజమైన ప్రక్రియ. ప్రతి అమ్మాయి ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత ఈ దశలోకి చేరడం సహజం.  భారతదేశంలో మొదటిసారి రజస్వల అయ్యే అమ్మాయిల  సగటు వయస్సు 12 సంవత్సరాలు. అయితే ఈరోజుల్లో ఆడపిల్లలు 7-8 ఏళ్ల వయసులోనే రజస్వల అవుతున్నారు.  నిపుణుల అభిప్రాయం ప్రకారం చిన్న వయస్సులోనే రజస్వల  కావడం ఆరోగ్యకరం కాదట. దీని వల్ల భవిష్యత్తులో స్థూలకాయం, మధుమేహం వంటి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందట. ఎముకల పెరుగుదల ఆగిపోతుందట.  దీని కారణంగా పిల్లల ఎత్తు సాధారణం కంటే తక్కువగా ఉంటుంది. ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లీ దీని గురించి పూర్తీగా తెలుసుకోవాలి.


సోషల్ మీడియా ఎక్స్పోజర్ ఆడపిల్లలలో తొందరగా రజస్వల కావడానికి  కారణం. సోషల్ మీడియాలో అడల్ట్ కంటెంట్, ప్రకటనలు లేదా ఫిల్మ్‌లను చూసే పిల్లలలో పిట్యూటరీ గ్రంధిపై చాలా ప్రభావం ఉంటుంది. ఇది హార్మోన్లకు అంతరాయం కలిగిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ ఆడపిల్లలో తొందరగా రజస్వల కావడానికి  కారణమవుతుంది.


నిపుణుల అభిప్రాయం ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా అమ్మాయిల జీవనశైలి,  ఆహారపు అలవాట్లలో చాలా తేడాలు ఉన్నాయి. బాల్యంలో నాన్-వెజ్ లేదా జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే అమ్మాయిలకు చిన్న వయస్సులో రజస్వల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయట. ఇది ఆరోగ్యానికి హానికరం.


చిన్నప్పటి నుండి పిల్లలు చాలా తీపి పదార్థాలు తింటారు. అది స్వీట్లు, చాక్లెట్లు లేదా ప్యాక్డ్ ఫుడ్ ఇలా చాలా ఉంటాయి.  వీటిలో ఉండే చక్కెర హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. చక్కెర ఎక్కువగా ఉన్న పదార్థాలు ఆడపిల్లలు రెగ్యులర్ గా తీసుకుంటే త్వరగా  రజస్వల  రావచ్చు.


రోజువారీ జీవితంలో సోమరితనం,  చురుకుగా లేని అమ్మాయిలకు  పీరియడ్స్ త్వరగా వచ్చే అవకాశం ఉంది. ఇది కాకుండా 30-40 నిమిషాల పాటు ఎటువంటి శారీరక వ్యాయామం చేయని అమ్మాయిలకు నిర్ణీత వయసు కంటే  ముందే రజస్వల ప్రారంభమవుతుంది.


పిల్లల మీద అతిప్రేమతో చాలా రకాల ఆహారాలు వద్దనకుండా కొనిపెట్టడం వల్ల  బరువు ఎక్కువగా ఉంటారు. అంతేకాదు మరింకొంత మంది బరువు తక్కువగా ఉంటారు.  వీటి వల్ల కూడా  ప్రీమెచ్యూర్ పీరియడ్స్ రావడం ప్రారంభమవుతుంది. ఆరోగ్యకరమైన బరువు శరీరంలో  హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. అయితే అనారోగ్యకరమైన బరువు  హార్మోన్లలో మార్పులకు కారణమవుతుంది.  ఇది ఆడపిల్లలలో తొందరగా రజస్వల కావడానికి కారణం అవుతుంది.  ప్రారంభ కాలాల అవకాశాలను పెంచుతుంది.


                                               *రూపశ్రీ.