GANESHA MY FRIEND
posted on Sep 7, 2013
వినాయకుడు అనగానే పిండి వంటలు, పూజా కార్యక్రమాలు అన్నీ పద్ధతిలో చేస్తాం.
సరేమరి! ఈ వినాయక చవితి పండగ ఎందుకు చేస్తాం? ఈ పండగ "హీరో" వినాయకుడే కదా!
తన వ్యక్తిత్వం నుండి పిల్లలు ఏం గ్రహించాలో ఈ విషయాలు కూడా చెబితే పిల్లలు GANESHA MY FRIEND అంటూ గణేష్ తో ఫ్రెండ్ షిప్ చేస్తారు.
గణేష్ వ్యక్తిత్వం మనకు చెప్పేది
తన శరీరాకృతిని చూసి ముడుచుకుపోలేదు. తన ప్రతిభతో అన్నీ లోకాలకు అధిపతి అయ్యాడు. మనం ఎలా ఉన్నామని కాదు. మన ప్రతిభ ఏమిటనేది ముఖ్యంగా గ్రహించాలి అని చెబుతారు గణేశా.
Tough time లో కూడా smart గా ఆలోచించటం గణేష్ నుండి పిల్లలు గ్రహించాల్సిన మరో విషయం. అన్నీ లోకాలు చుట్టి మొదట ఎవరు వస్తే వారికే గణాధిపత్యం ఇస్తాం అని అంటే... తన ఎలుక వాహనంతో అన్ని లోకాలు చుట్టి మొదట రావటం అసాద్యం అని తెలిసి, తన తల్లిదండ్రుల చుట్టూరా ప్రదక్షిణాలు చేసి గణాధిపత్యాన్ని దక్కించుకున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఓటమిని అంగీకరించకుండా, గెలవాలనుకుంటే విజయం ఎదురస్తుంది అని ఈ సంఘటన మనకి చెబుతుంది.
స్నేహానికి సరిసమానులే అవసరం లేదని ఎలుకతో friendship చేసి, ఎలుకతో తనకున్న స్నేహం మనకు నేర్పిస్తుంది.
ఇక గణేష్ ఆకారాన్ని ఒకసారి చూస్తే...
పెద్ద చెవులు ఎదుటివారు చెప్పేది శ్రద్దగా వినమని చెబుతాయి. చిన్నికళ్ళు సూక్ష్మదృష్టి అవసరమని చెబుతాయి. ఇలా గణేష్ ఆకారం నుంచి వ్యక్తిత్వం దాకా ఎన్నో పిల్లలు తమ జీవితంలో నేర్చుకుతీరాల్సినా పాఠాలు కనిపిస్తుంటాయి. కేవలం దేవుడిగా పూజించి వదిలేయకుండా, మనం నేర్చుకోవాల్సిన ఇంకా బోలెడన్ని ప్రత్యేకతలు కనిపిస్తాయి వినాయకుడిలో. మరి పిల్లలకు గణేష్ గురించి తప్పకుండా చెబుతారు కదా!
వినాయక చవితి శుభాకాంక్షలు
-రమ