నిద్ర వస్తే కేఫ్ కి వెళ్ళండి

 

ఇంట్లో పనంతా చేసుకుని, పొద్దున్నే ఇల్లు వదిలి ఆఫీసులకు పరుగెడతారు ఉద్యో గినులు. మళ్లీ ఎప్పటికో ఇంటికి చేరతారు. ఈ మధ్యలో విశ్రాంతి తీసుకునే సమయం ఉండదు. ఒకవేళ ఉన్నా, ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలో తెలియదు. అలాంటి వారి కోసమే ‘కాస్కా స్లీపింగ్ కేఫ్’ని ప్రారంభించారు టోక్యోలో.

 

అలసిపోయి కాసేపు ప్రశాంతంగా నిద్రపోవాలనుకునేవాళ్లు ఇక్కడికి వెళ్లవచ్చు. చక్కని గదిలో, మెత్తటి పరుపు మీద హాయిగా కునుకు తీయవచ్చు. పది నిమిషాల నిద్రకు 1.60 యెన్‌లు వసూలు చేస్తారు. తీరికను బట్టి గంట నుంచి ఎన్ని గంటలవరకైనా బుక్ చేసుకోవచ్చు. సమయాన్ని బట్టి చార్జ్ వసూలు చేస్తారు. కానీ ఇది ఆడవాళ్లకు మాత్రమే. ఆఫీసయ్యాక ఇళ్లకెళ్లి కూడా వాళ్లు పని చేసుకోవాలి, విశ్రాంతి తీసుకోవడానికి కుదరదు కాబట్టి ఈ ఏర్పాటు చేశారు. భలే ఐడియా!