Tips to Avoid Gas Problems
posted on Sep 18, 2012
Tips to Avoid Gas Problems
Tips to Avoid Gas Problems, Natural Way Avoid Gas Problems, Aviod Gas Problems Tips: గ్యాస్ ఉన్న వారు సరిగా తినకపోవడం, తొందరగా తిన్నది జీర్ణం
కాకపోవడం. కడుపులో మంట. పులుపు, కారం లాంటివి ఎక్కువ తినలేకపోవడం వంటి
ఎన్నో బాధలు పడుతున్నారు.గ్యాస్ వల్ల పొట్టలో ఉబ్బరం కలుగుతుంది. త్రేన్పులు
వస్తాయి. కడుపులో నొప్పి, అజీర్ణం కలుగుతుంది. అపనవాయువుతో ఇబ్బంది. కడుపులో
గ్యాస్ ఆపుకుందామంటే ఆగాడు. ఆపితే విపరీతమైన నొప్పి. వాసన ఉంటే భరించడం కష్టం.
దీని నుండీ బయటపడడం ఎలా? దాని నివారణకు ఇంట్లోనే చేసుకునే చిన్నపాటి చిట్కాలు
మీ కోసం.
* ఆహారాన్ని బాగా నమిలి, నెమ్మదిగా, తక్కువగా తినాలి.
* ధూమపానం, జర్దా తినకూడదు.
* కొన్ని వ్యయమ పద్ధతులు పాటించాలి.
* కూల్ డ్రింక్స్, తీపి పదార్థాలు తగ్గించాలి.
* వేళకి భోజనం చేయాలి.
* రోజుకు 10-12 గ్లాసుల నీరు త్రాగాలి
* ధనియాలు నమలండి. అది గ్యాస్ ను పోగొడుతుంది. కడుపునొప్పిని తగ్గిస్తుంది.
* కప్పు మరిగే నీటిలో కొద్దిగా అల్లం, తేనె కలిపి త్రాగండి.
* తాజా అల్లం ముక్కని నిమ్మరసంలో ముంచి అన్నం తిన్నాక తింటే ఆహారం తొందరగా
జీర్ణమవుతుంది.
* గ్యాస్ రిలీఫ్ కి ఇంగువ బాగా పనిచేస్తుంది.
* ఒక గ్లాసు మరుగుతున్న నీటిలో పీచ్ ఆకులూ వేసి 10-15 నిమిషాల తర్వాత త్రాగాలి.
రోజుకు మూడు సార్లు చేస్తే తొందరగా ఉపశమనం కలుగుతుంది.
* అరచెంచా వాముపొడి, చెంచా యాలకుల పొడి, ఒక చెంచా మిరియాల పొడి, శొంఠి పొడి
చెంచా కలిపి ఉంచుకోవాలి. రోజుకు రెండు సార్లు 400మి.లీ నీటితో తీసుకుంటే అజీర్ణం,
గ్యాస్, ఉబ్బరం తగ్గుతాయి.
* తులసి ఆకులు నిమితే కడుపులో గ్యాస్ ఏర్పడదు.
* మిరియం,శొంఠి, ఏలకులు ఒక్కొక్క్ టీ స్పూన్ చొప్పన తీసుకుని పొడి చేసి అరస్పూన్
నీటిలో కలిపి భోజనం తరువాత అరగంట ఆగి త్రాగాలి.