జుట్టు వేగంగా పెరగడానికి అమ్మమ్మల కాలం నాటి సీక్రెట్ టిప్.. ఒక్కసారి ట్రై చేయండి!

జుట్టు వేగంగా పెరగడానికి అమ్మమ్మల కాలం నాటి సీక్రెట్ టిప్.. ఒక్కసారి ట్రై చేయండి!

ఈ రోజుల్లో జుట్టు విరిగిపోవడం, బలహీనంగా మారడం సర్వసాధారణ సమస్యగా మారింది. జుట్టు రాలడం నుండి ఉపశమనం పొందడానికి  అన్ని రకాలుగా ప్రయత్నిస్తారు, మార్కెట్లో లభించే షాంపూలు,  లోషన్లు,  ఆయిల్స్.. ఇళా చాలా ట్రై చేస్తారు. కానీ ఇన్ని చేసిన తర్వాత కూడా వారి జుట్టులో ఎటువంటి చెప్పుకోదగ్గ ఫలితం కనిపించదు. అలాంటి వారికి అమ్మమ్మల కాలం నాటి సీక్రెట్ టిప్ బాగా పని  చేస్తుంది. జుట్టు రాలడాన్ని చాలా తొందరగా కంట్రోల్ చేసే అమ్మమ్మల చిట్కా.. ప్రతి ఒక్కరూ ఉపయోగించవచ్చు.  ఆ టిప్ ఏటో.. దాన్ని ఎలా అప్లై చేయాలో తెలుసుకుంటే..

కొబ్బరి నూనె..

కొబ్బరినూనె అందరికీ తెలిసిందే.. ఇందులో కొత్తగా ఏముందని అందరికీ అనిపిస్తుంది.  కానీ కొబ్బరి నూనెను అప్లై చేయడమే అసలైన సీక్రెట్.  చాలామంది జుట్టుకు నూనెను కొన్ని సెకెన్లలో చకాచకా అప్లై చేసి జడ వేసుకుంటారు.  కానీ అమ్మమ్మల కాలంలో జుట్టుకు నూనె పెట్టే విధానం పూర్తీగా విభిన్నం. పైగా కొబ్బరి నూనెలో ఉల్లిపాయ రసాన్ని జోడిస్తే జుట్టు మరింత మెరుగ్గా మారుతుంది.

కొబ్బరి నూనె ఉల్లిపాయ రసం..

జుట్టు సంరక్షణకు ఉల్లిపాయ రసం చాలా మేలు చేస్తుంది. ఉల్లిపాయ రసంలో ఉండే సల్ఫర్, జుట్టు సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.  జుట్టుకు కొబ్బరి నూనె , ఉల్లిపాయ రసం రాయడం వల్ల జుట్టు రాలడాన్ని తగ్గించవచ్చు. జుట్టు సంరక్షణ కోసం,  కొబ్బరి నూనెతో పాటు ఉల్లిపాయ రసాన్ని కూడా ఉపయోగించవచ్చు. దీనివల్ల జుట్టు పొడిబారడం కూడా తగ్గుతుంది.

ఎలా అప్లై చేయాలి?

రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను, అంతే పరిమాణంలో ఉల్లిపాయ రసంతో కలపాలి. దీనిని  నెత్తికి పట్టించి, ఒక గంట పాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత, తేలికపాటి షాంపూతో మీ జుట్టును కడగాలి.
దీనిని వారానికి రెండుసార్లు చేయడం వల్ల జుట్టు రాలడం చాలా తగ్గుతుంది.

కొబ్బరినూనె అలోవెరా..

కలబంద జెల్ రాయడం వల్ల తలపై దురద , చికాకు తగ్గుతాయి. కలబందను ఉపయోగించడం వల్ల చుండ్రు కూడా తగ్గుతుంది. కొబ్బరి నూనె , కలబంద జెల్ కలిపి  జుట్టుకు రాయడం వల్ల దెబ్బతిన్న జుట్టును బాగుచేయడంలో సహాయపడుతుంది.  జుట్టు చాలా పొడిగా ఉంటే,  కొబ్బరి నూనె , కలబంద జెల్ ను  జుట్టుకు రాసుకోవచ్చు.

ఎలా అప్లై చేయాలి?

రెండు టీస్పూన్ల కలబంద జెల్ ను,  రెండు టీ స్పూన్ల  కొబ్బరి నూనెను తీసుకోవాలి. వాటిని బాగా మిక్స్ చేయాలి.  ఈ పేస్ట్‌ను  జుట్టుకు పట్టించాలి. 45 నిమిషాల తర్వాత, తేలికపాటి షాంపూతో  జుట్టును కడగాలి.

పైన పేర్కొన్న రెండు సీక్రెట్ టిప్స్ జుట్టు రాలడాన్ని ఆపడంలో చాలా సహాయపడతాయి.  జుట్టు పెరగడానికి కూడా తోడ్పడతాయి.

                                      *రూపశ్రీ..