మరకలు పోవాలంటే ఇలా...


మరకలు పోవాలంటే ఇలా...

 

 

మనం ఎంతో ఇష్టపడి కొనుక్కునే బట్టలపై ఒక్కొక్కసారి అనుకోకుండా పడే మరకలు మనని ఎంతో  బాధపెడతాయి. వాటిని చూసి బాధపడటం మానేసి ఇంట్లో దొరికే వస్తువులతోనే ఎంతో సులువుగా మరకను పోగొట్టి మళ్ళీ మన ఆనందాన్ని తిరిగి తెచ్చుకోవచ్చు.



తుప్పు మరకల

బట్టలని తీగల మీద లేదా రాడ్స్ మీద ఆరేసేటప్పుడు ఒక్కోసారి తుప్పు అంటుకుని మరక పడుతుంది. ఆ మరకలు పోవాలంటే నిమ్మకాయ రసంతో,లేదా ఉప్పు కలిపిన నిమ్మరసంతో బాగా రుద్ది ఎండలో వేయాలి. ఇలా రెండు సార్లు చేస్తే చాలు మరక మాయం అవుతుంది.


నూనె మరకలు

బట్టలపై పడే నూనె మరక అంత సులువుగా పోదు. అందుకనే నూనె పడిన వెంటనే ముందుగా పాత న్యూస్ పేపర్ ఆ మరకపై వేసి గట్టిగా వత్తాలి. తర్వాత వేడినీళ్ళు పోస్తూ సబ్బుతో రుద్దితే చాలు.



కాఫీ కప్పులపై పడే మరకలు


ఎంతో ఖరీదు పెట్టి కొనే కప్పులపైన మరకలు పడి  అవి పోవాలంటే వెంటనే ఆ కప్పుని తడిపితే చాలు లేదా ఎండిపోయిన మరక పోవాలంటే మాత్రం బైకార్బోనేట్ సోడా మిశ్రమంతో తుడిస్తే ఇట్టే పోతాయి.

 

పెయింట్ మరకలు

బట్టలపై పెయింట్ మరక పడితే ఆ మరకపై బ్లాటింగ్ పేపర్ వేసి దానిపై ఇస్త్రీ చెయ్యాలి. ఆ వేడికి మరక కరిగి బ్లాటింగ్ పేపర్ కి అంటుకుంటుంది. ఆ తర్వాత మరక మీద కొంచం టాల్కం పౌడర్ చల్లి కాసేపు వెయిట్ చేసి ఆ పేపర్ ని దులిపితే పౌడర్ తో పాటే మరక కూడా వదిలిపోతుంది.



బాల్ పెన్  ఇంకు మరకలు

పిల్లల స్కూల్ యూనిఫారం కి తరచూ బాల్ పెన్ మరకలు మనం చూస్తూ ఉంటాం. అలాంటివి పోవాలంటే టూత్ పేస్ట్ గాని, నిమ్మరసం గాని,బ్రాంది లేదా విస్కీ చుక్కలు వేసి రుద్దితే ఆ మరకలు పోతాయి.


 

 

పట్టుచీరలపై మరకలు

ఎంతో  ఖరీదు పెట్టి కొనుక్కునే పట్టుచీరల మీద మరక పడితే బాదెందుకు? వెంటనే పెట్రోల్ తో రుద్దితే మరక పోతుంది. డ్రై క్లీనింగ్ కి కూడా ఇవ్వక్కర్లెద్దు.




చూసారా! ఇన్ని తరుణోపాయాలు మన ముందే ఉంటే మరకను చూస్తే టెన్షన్ అవసరమంటారా?

                                                                                                ----కళ్యాణి