Special healthy Foods for Beautiful Life -1

Special healthy Foods for Beautiful Life - 1

అందంగా కనిపించాలంటే మనసు మీద ఒత్తిడి పెంచకూడదు. ఒత్తిడి పెరుగుతున్న కొద్ది

శరీరంలోని ఇతర అంగాల పని తీరును దెబ్బతీస్తుంది. అంగాలన్నీ సమర్థతతో పని

చేస్తున్నప్పుడు ముఖంలో వెలుగు వస్తుంది. అదే అంచాన్ని ఇస్తుంది. శరీరంలోని

అవయవాల పని తీరు దెబ్బతిన గానే రక్తప్రవాహంలో తేడా వస్తుంది. కండరాలు సరిగా

పని చేయవు. మనిషి ముఖంలో వెలుగు లోపిస్తుంది. అందుకే ఆరోగ్యం కోసం తీసుకునే

జాగ్రత్తలు మనసును దెబ్బ తీయకూడదు. ఇంట్లోవారిని తిడుతూ, విసుక్కుంటూ పనిచేసే

వారికి బి.పి పెరిగిఆరోగ్యం దెబ్బతిని చివరకు ముఖాలు వికారంగా కనిపిస్తాయి.

మనసును అదుపులో వుంచుకోగలిగిన వారికే ఆనందం, అందం రెండూ సమకూరతాయి.

 

సముద్ర చేపలతో ఆరోగ్యం

సముద్రంలో లభించే చేపలు (fish), ఆల్చిప్పలు (Shell fish) వీటిని తీసుకునే వారికి

వృద్ధాప్య లక్షణాలు అంత త్వరగా రావని నిరూపించారు. చేపలు తినే వారి ఆయుర్దాయం

పెరుగుతుంది. చేపలు చేసే మేలులో గుండె కొట్టుకోవడం సరిదిద్దడం ఒకటి. రక్తంలోని ట్రై

గ్లిసరైడ్స్ ని తగ్గిస్తాయి. రక్తంలోని చక్కెరలని స్థిరీకరించే శక్తి చేపలకుంది.

 

కళ్ళకు... క్యారెట్‍

మనిషి శరీరంలో చూడగనే ఆకట్తుకునేవి కళ్ళు. కంటి ఆరోగ్యం మెరుగ్గా వుంటే, ముఖం

అందంగా వుంటుంది. చూపు పటిష్టంగా వుంటుంది. కనుగుడ్డుని కంటి మీద వుండే

పలుచని పొర రక్షిస్తుంది. చూపు పటిష్టంగా వుంటుంది. దుమ్ము, ధూళి, గాలిలో వుండే

సూక్ష్మ జీవుల నుండి కంటి చూపును రక్షించేది ఈ పొరే. అటువంటి కార్నియా

(cornea)పొర రక్షణకు, కంటి ఆరోగ్యానికి విటమిన్ ఏ బాగా కావాలి. మనం తినే ఆహార

పదార్థాలలోని బీటా కెరోటీన్ ని శరీరం విటమిన్ ఏ గా మార్చుకుంటుంది. ఈ బీటా

విటమిన్‍లు క్యారెట్‍లో (carrot) అధికంగా వున్నాయి. అందుకే కంటి ఆరోగ్యం కోసం

క్యారెట్‍లు తినాలి.

 

స్తనాలకు... కర్బూజ

ఆడవారికి అందమైన రూపాన్ని ఇవ్వడంలో స్తనాల సైజుకు పాత్ర వుంటుంది. గుండ్రంగా,

నిండుగా వుండే స్తనాల ఆరోగ్యం కోసం ఖర్బూజ, బత్తాయి, నారింజ, నిమ్మ వంటి పండ్లు

ఆహారంగా తీసుకోవాలి. ఈ తరహా పంద్లు అన్నిటిలో సి విటమిన్ అధికంగా వుంటుంది.

విటమిన్ రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. సి విటమిన్ ప్రకృతి సహజమైన

ఆహార పదార్థాల ద్వారా శరీరానికి అందిస్తే అది స్తనాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. స్తనాల

క్యాన్సర్‍ రాకుండా కాపాడేది సి విటమిన్.