రోజూ స్కిప్పింగ్ చాలు.. ఆరోగ్యం సూపర్..

రోజూ స్కిప్పింగ్ చాలు.. ఆరోగ్యం సూపర్..

రకరకాల వ్యాయామాలపై దృష్టి సారిస్తూ, కొందరు తమ శరీర సౌష్టవాన్ని సంరక్షించుకుంటుంటే., ఇంకొందరు మాత్రం రోజూ ఒకే వ్యాయామాన్ని రోజు అనుసరిస్తూ తమ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకుంటున్నారు. ఇది ఏలా సాధ్యం...

* శరీరం మొత్తానికి ఓకేసారి వ్యాయామం, తాడాట (స్కిప్పింగ్)తో సాధ్యమవుతుందని ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్‌లు సూచిస్తున్నారు.

* శరీరంలోని అవయవాల కదిలికను వేగవంతం చేయ్యటంతో పాటు వాటి మధ్య సమన్వయానికి స్కిప్పింగ్ తోడ్పడుతుందట.

*  రోజు స్కిప్పింగ్ చేయ్యటం వల్ల శరీరం ధృడత్వాన్ని సంతరించుకోవటంతో పాటు పూర్తి స్థాయిలో ఫిట్‌గా తయారవుతుంది. ఎముకలు గట్టిపడటంతో పాటు చర్మంపై ఏర్పడ్డ ముడతలు తొలగిపోతాయి.

*  స్కిప్పింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. పాదాలకు రక్షణ లేకుండా స్కిప్పింగ్ చేయ్యటం వల్ల పాదాలకు నొప్పి కలుగుతుంది. దాంతోపాటు పగుళ్లు ఏర్పడతాయి.

* ముఖ్యంగా కాంక్రీట్ నేలపై స్కిప్పింగ్ చేసే సందర్భంలో బూట్లు వేసుకోవటం మంచింది.

* బరువు తగ్గించటంలో స్కిప్పింగ్ కీలక పాత్ర పోషిస్తుంది.

* స్కిప్పింగ్ ప్రారంభించే ముందు ఐదు నిమిషాల పాటు వార్మప్ చేయ్యటం వల్ల శరీరం ఉల్లాసంగా ఉంటుంది.