సంక్రాంతి సంబరాలలో ముఖం మెరిసిపోవాలంటే ఇలా చేయండి!
posted on Jan 13, 2024
సంక్రాంతి సంబరాలలో ముఖం మెరిసిపోవాలంటే ఇలా చేయండి!
'
సంక్రాంతి పండుగ వస్తోంది. ఈ పండుగలో అమ్మాయిల అందం, వారు వేసే ముగ్గులతో పోటీ పడుతూ ఉంటుంది. ఇక వస్త్రధారణ సరేసరి. ఎంత అందంగా తయారు అయినా మగువల ముఖం వెలవెలబోతుంటే ఏమీ బాగుండదు. పండుగ కళ మొత్తం ముఖంలో కనిపించాలన్నా, ముఖం గాజులా మెరిసిపోవాలంటే కొరియన్ స్టైల్ గ్లాసీ స్కిన్ కోసం ప్రయత్నం చెయ్యాలి. కొరియన్ అమ్మాయిలకు ఉన్నట్టు ముఖం గాజులా మెరిసిపోవడానికి ప్రముఖ నటి ప్రియాంక చోప్రా తల్లి డాక్టర్ మధు చోప్రా ఓ అద్భుతమైన చిట్కా చెప్పారు. దీన్ని ఫాలో అవుతుంటే 50 ఏళ్ల వయసు వచ్చినా ముఖంలో ఏ చిన్న ముడత కనిపించదు. అదేంటో తెలుసుకుంటే..
కొరియన్ అమ్మయిల్లా గ్లాసే స్కిన్ కావాలి అంటే రైస్ వాటర్ చాలా బాగా పనిచేస్తుంది. చాలామంది రైస్ వాటర్ అంటే బియ్యపు కడుగుతో ముఖం కడుగుతుంటారు, అదే ముఖానికి స్ప్రే చేస్తుంటారు. కానీ రైస్ వాటర్ తయారు చేసుకోవడం, ముఖానికి అప్లై చేయడం పూర్తిగా విభిన్నమైన పద్దతి.
సరైన జుట్టుకు మాత్రమే కాకుండా చర్మాన్ని కాంతివంతం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇప్పట్లో బియ్యం నీటిని అనేక చర్మ సంరక్షణ ఉత్పత్తులలో కూడా ఉపయోగిస్తున్నారు. వీటిలో అమినో యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ మంచి పరిమాణంలో ఉంటాయి, ఇవి వృద్ధాప్య ప్రక్రియను మందగించడంలో సహాయపడతాయి. బియ్యం నీరు చర్మశుద్ధి, మచ్చలు, వడదెబ్బ సమస్య నుండి ఉపశమనాన్ని అందిస్తుంది..
ముందుగా అరకప్పు బియ్యాన్ని బాగా కడిగి కొంచెం నీళ్ళు వేసి స్టౌ మీద పెట్టి ఉడికించాలి. బియ్యం ఊడుకు పట్టిన తరువాత స్టౌ ఆఫ్ చేసి బియ్యంలో ఉన్న నీటిని వేరు చేయాలి. సాధారణంగా దీన్ని స్టార్చ్ అని అంటారు. ఇది మరీ పలుచగా ఉండకూడదు. కాసింత గట్టిగానే ఉండాలి. అందులో అలోవెరా జెల్, కొన్ని చుక్కల ఆముదం కలపాలి. చర్మం జిడ్డుగా ఉంటే కొద్దిగా నిమ్మరసం జోడించవచ్చు. కానీ చర్మం పొడిగా ఉంటే ఆలివ్ నూనె వేసి కలపాలి. ఇదే రైస్ వాటర్ మాస్క్.
ఈ పేస్ట్‌ను రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి. మరుసటి రోజు ఉదయం ముఖాన్ని కడిగి ఆరిన తరువాత దీన్ని ముఖానికి అప్లై చేయలి.. దీన్ని ముఖానికి మాస్క్ లాగా అప్లై చేసుకోవచ్చు. మొదట్లో ఇది ముఖాన్ని శుభ్రపరిచి చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. ఏడు రోజుల పాటు ఈ రెమెడీని కంటిన్యూగా పాటించడం వల్ల గాజులాంటి మెరిసే చర్మం సొంతమవుతుంది. దీన్ని లైఫ్ స్టైల్ లో భాగం చేసుకుంటే 50 యేళ్లు వచ్చినా ముఖంలో ముడతలు, మచ్చలు కనిపించవు.
*నిశ్శబ్ద.