కాబోయే భర్తకు ఉండాల్సిన లక్షణాలు...?

 

తనకు కాబోయే భర్త అలా ఉండాలి, ఇలా ఉండాలి అంటూ ఏవేవో కలలు కంటుంటారు. మరి నేటి అమ్మాయిలు వారికి కాబోయే మొగుడికి ఎలాంటి లక్షణాలు ఉండాలని కోరుకుంటున్నారో తెలుసుకుందామా...!

 

ప్రతి అమ్మాయి తన జీవిత భాగస్వామి అందంగా ఉండాలని కలలు కంటూ ఉంటుంది. అందంతోపాటు అతని చదువు, ఆదాయం, వ్యక్తిగత గుణాలు, మంచి అలవాట్లు కలిగిన వాడైతేనే ఇష్టపడుతున్నారు నేటి అమ్మాయిలు.

చాలా మంది అమ్మాయిలు తనకు కాబోయే భర్త తనకన్నా గొప్పగా చదివి వుండాలి, మంచి తెలివిపరుడై ఉండాలి. అందరికన్నా యోగ్యుడై ఉండాలని కోరుకుంటున్నారు. కనీస్ ధైర్యం అయిన ఉండాలి. తన భర్త పక్కనుంటే కొండత ధైర్యంగా ఉంటుందని భార్య అనుకునే వారినే నేటికాలం అమ్మాయిలు కోరుకుంటున్నారు.

తల్లిదండ్రుల ఆదాయంపై లేదా భార్య తెచ్చే ఆదాయంపై ఆధారపడి జీవించే అబ్బాయిలంటే అమ్మాయిలు మొహం చాటేస్తున్నారు. సొంతగా సంపాదించే అబ్బాయిలనే తమ జీవిత భాగస్వామిగా కోరుకుంటున్నారు అమ్మాయిలు.

మంచి లక్షణాలు, బాగా డబ్బున్నవారంటేనే ఇష్టపడుతున్నారు. తమ ఆలోచనలను పదిమందితో పంచుకునేవాడు, పదిమందికి ఆదర్శప్రాయుడై ఉండేవాడు,అలాగే అమ్మాయిల ఆలోచనలను గౌరవించేవారంటే మరీ ఇష్టపడుతుంటారు.

భర్తగానే కాకుండా తనకు మంచి మిత్రునిగా కూడా ఉండాలని... సుఖ దుఃఖాలలో, కష్టనష్టాలలో, సంతోషంలో తనతో పాలుపంచుకునే వాడినే తన జీవిత భాగస్వామిగా కోరుకుంటున్నారు నేటి అమ్మాయిలు.

తనంటే ప్రేమ, గౌరవం, అభిమానం పంచేవాడైతేనే అమ్మాయిలు ఇష్టపడుతున్నారు. తనని విడిచిపెట్టి విదేశాలలో ఉద్యోగాలు చేసే భర్తలను నేటి అమ్మాయిలు ఇష్టపడట్లేదు. చిన్న ఉద్యోగం చేసిన కూడా, తన కళ్ళముందే ఉంటూ, సంతోషంగా చూసుకునే అబ్బాయిలంటే ఇష్టపడుతున్నారు నేటి అమ్మాయిలు.