నెమలి డిజైన్ గాజులతో అందం
posted on Sep 10, 2014
నెమలి డిజైన్ గాజులతో అందం
పురివిప్పిన నెమలి అందంగురించి చెప్పేదేముంది..
నెమలి పింఛం రంగులకి ఉన్న ఆకర్షణ అంతా ఇంతా కాదు. ఆ నెమలి అందాలు, మన ముంజేతికి ఎక్కితే -
ఈ మధ్య నెమలి మరోసారి లేటెస్ట్ డిజైన్స్ తో మనల్ని అలంకరించేందుకు వచ్చేస్తుంది.
అచ్చంగా నెమలి పింఛం రంగులతో ఎన్నో గాజులు వచ్చేస్తున్నాయ్. అలాగే నెమలి డిజైను గాజులు ఇలా రకరకాల వెరైటీలు దొరుకుతున్నాయి. పురివిప్పిన నెమలి గాజులకైతే అమ్మాయిల నుంచి బోలెడంత డిమాండ్.
మరి ఆ అందాల నెమలిని ముంజేతికి ఎలా అలంకరించాలో ఆలోచించండి.
- రమ