పరికిణీలు మారుతున్నాయి
posted on Jun 27, 2016
పరికిణీలు మారుతున్నాయి
అంచున్న పొడుగు పరికిణీలు ఒకప్పుడు ఒక వెలుగు వెలిగాయి. ఆ తర్వాత మిడ్డిలు, స్కర్ట్స్ రాకతో అవి కాస్త వెనక బడ్డాయి. ఎదో ఓణిలు వేసినప్పుడు మాత్రమే పరికిణీలు వేసుకునేవారు అమ్మాయిలు. అయితే ఈ మద్య మళ్ళి ట్రెండ్ మారింది. లేహంగాలు అని ..సైడ్ కి చున్ని లు వేస్తూ ...చిన్నా, పెద్దా కూడా వేస్తున్నారు. అయితే అవికూడా ..ఒణి ల తో కాబట్టి అవి మన పరికిణి లిస్టు లోకి రావు. సంతోషించే విషయం ఏంటంటే ..ఇప్పుడు మన పరికిణి లు మళ్ళి ...అమ్మాయిల మనసు దోచుకుంటున్నాయి . రెగ్యులర్ గా కాలేజీ లకి కూడా వేసుకుంటున్నారు.
అయితే కాస్త వరైటి గా ..జరి,పట్టు లేసులు ,గోట డిజైన్ల అంచులతో పట్టు నుంచి జార్జెట్, కాటన్ , క్రేప్ లాంటి రకరకాల మెటీరియల్స్ తో చూడగానే ఆహా అనిపించేలా ఉంటున్నాయి . పైన అంతా ప్లైన్ గా వుంటుంది. పాదాల పైకి లాంగ్ స్కర్ట్ పొడువు తో వుండే ఈ పరికిణి లకి కింద అర చేతి మందాన్న బోర్డర్ వుంటుంది. ఆ బోర్డర్ కి సరిపోయేలా జాకెట్టు ని డిజైన్ చేస్తున్నారు . లాంగ్ స్లీవ్స్ తో చూడటానికి భలే వుంటాయి . అటు ఓల్డ్ ఫ్యాషన్ , ఇటు న్యూ లుక్ ...మీరు ట్రై చేయండి ...మీ టేస్ట్ కి తగ్గట్టు డిజైన్ చేయించు కోండి.
..రమ