ఎక్కువ ఖర్చు పెట్టకుండా హుందాగా, ఆకర్షణీయంగా కనిపించాలనుందా? ఇదిగో ఈ టిప్స్ మీకోసమే..!

నేటికాలంలో  సోషల్ మీడియాలో చాలా రకాల  కొత్త , విభిన్న ఫ్యాషన్ స్ట్రైల్స్  వైరల్ అవుతున్నాయి. కొందరు తమ స్పెషల్ లుక్ తో  అందరి దృష్టిని ఆకర్షిస్తుంటే, మరికొందరు తమ వెరైటీ లుక్స్ తో  ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో, ప్రతి ఒక్కరూ క్లాసీగా , ఆకర్షణీయంగా కనిపించాలని కోరుకుంటారు, అయితే అలాంటి లుక్ సాధించడానికి చాలా డబ్బు అవసరమని చాలా మంది అనుకుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు ఫ్యాషన్ గా, ట్రెండీ గా కనిపించాలంటే చాలా డబ్బు ఖర్చు పెట్టాలనే భ్రమలో ఉంటారు.  కానీ  బడ్జెట్ తక్కువగా ఉన్నప్పటికీ, కొన్ని సాధారణ అలవాట్లు , తెలివైన స్టైలింగ్ ట్రిక్కుల సహాయంతో,  ఎక్కువ ఖర్చు చేయకుండానే క్లాసీగా, లగ్జరీగా ,  మరింత కాన్పిడెంట్ గా కనిపించవచ్చు.  ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండానే పూర్తిగా క్లాసీగా , అట్రాక్షన్ గా  ఎలా కనిపించాలో.. దానికి ఏం చేయాలో తెలుసుకుంటే..

ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండానే క్లాసీగా, అట్రాక్షన్ గా ఉంచే చిట్కాలు..

క్లాసీగా, అట్రాక్షన్ గా  కనిపించడానికి ఖరీదైన బట్టలు లేదా పెద్ద బ్రాండ్లు ధరించాల్సిన అవసరం లేదు. సరైన ఫిట్, ఫ్యాబ్రిక్ , రంగును ఎంచుకోవడం చాలా ముఖ్యం. అంతేకాకుండా, చక్కని అలంకరణ, ఇస్త్రీ చేసిన బట్టలు, శుభ్రమైన బూట్లు , సరైన యాక్సెసరీలు  మొత్తం రూపాన్ని మరింత గ్రాండ్ గా కనిపించేలా చేస్తాయి.  సింపుల్ గా క్వాలిగా ఉండే దుస్తులను ధరించి వాటిని సరిగ్గా జాగ్రత్తగా చూసుకుంటూ, కాన్పిడెంట్ తో ఉంటే..  తక్కువ ఖర్చులోనే గ్రాండ్ లుక్ కనిపిస్తుంది.

కచ్చితంగా పాటించాల్సిన చిట్కాలు..

వ్యక్తిగత శుభ్రత..

ఖరీదైన బట్టల కంటే కూడా శుభ్రమైన, చక్కని, కంప్లీట్ లుక్  బాగుండటం మరింత ముఖ్యం. కాంతివంతమైన చర్మం, శుభ్రంగా ,  మంచి షేప్ చేసిన  గోళ్లు, మృదువైన జుట్టు, , చక్కగా కత్తిరించిన జుట్టు  మొత్తం వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తాయి. కొన్నిసార్లు, మంచి వ్యక్తిగత శుభ్రతతో ఒక సాధారణ టీ-షర్ట్ కూడా అద్భుతంగా కనిపిస్తుంది. ఖరీదైన ఫేషియల్స్ లేదా పార్లర్ చికిత్సలు అవసరం లేదు. ప్రతిరోజూ  చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి. పుష్కలంగా నీరు త్రాగాలి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా నీరు త్రాగండి,  పడుకునే ముందు మేకప్ తొలగించాలి. ఈ సాధారణ అలవాట్లు  ముఖంపై సహజమైన కాంతిని నిలుపుకోవడానికి సహాయపడతాయి.

ఫిట్ - ఫ్యాబ్రిక్..

 దుస్తులు చాలా ఖరీదుగా కనిపించడంలో ఫిట్టింగ్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. బట్టలు మరీ వదులుగా, మరీ బిగుతుగా, లేదా సరైన పొడవులో లేకపోతే, అవి ఖరీదైనవి అయినప్పటికీ చౌకగా కనిపించవచ్చు. అదే సమయంలో, సరైన ఫిట్‌తో ఉన్న సాధారణ బట్టలు చాలా స్టైలిష్‌గా కనిపిస్తాయి. ఫిట్టింగ్‌తో పాటు, ఫ్యాబ్రిక్ ఎంపిక కూడా చాలా కీలకం. కాటన్ పాప్లిన్, లినెన్, సిల్క్, శాటిన్, వెల్వెట్, స్యూడ్, స్ట్రక్చర్డ్ డెనిమ్, ఉన్ని , ట్వీడ్ వంటి ఫ్యాబ్రిక్‌లు సాధారణ ఫ్యాబ్రిక్‌ల కంటే మరింత ప్రీమియం గా,   సొగసైన లుక్ ను అందిస్తాయి.

 రంగులు-  డిజైన్లు..

చాలా ప్రకాశవంతమైన లేదా నియాన్ రంగులు తరచుగా లుక్ ను తక్కువ ఆకర్షణీయంగా చేస్తాయి. బదులుగా, ముదురు , గాఢమైన రంగులు మరింత క్లాసీగా కనిపిస్తాయి. పచ్చ, బర్గండీ, నేవీ బ్లూ, ప్లమ్, చాక్లెట్ బ్రౌన్, మస్టర్డ్, డీప్ టీల్, టెర్రకోట మరియు డస్టీ పింక్ వంటి రంగులు దుస్తులకు కొత్త టచ్   జోడించగలవు. నలుపు, తెలుపు, బూడిద, నేవీ బ్లూ , టాన్ వంటి  రంగులను  వార్డ్‌రోబ్‌లో ఉంచుకోవడం ద్వారా వాటిని వివిధ రకాల దుస్తులు , యాక్సెసరీలతో సులభంగా జత చేయవచ్చు. అలాగే పెద్ద లోగోలు, అధిక ప్రింట్లు లేదా భారీ డిజైన్  లేని దుస్తులను ఎంచుకోవాలి.  సరళమైన, క్లాసిక్,  ఎవర్ గ్రీన్  డిజైన్లు ఎప్పుడూ  కాస్ట్లీగా , స్టైలిష్‌గా కనిపిస్తాయి.

 స్ట్రక్చర్డ్  ,  యాక్సెసరీలు..

 స్ట్రక్చర్డ్ దుస్తులు ఎప్పుడూ మరింత సొగసుగా కనిపిస్తాయి. బ్లేజర్లు, టెయిలర్డ్ బ్రౌజర్లు, హై-వెయిస్టెడ్ ప్యాంట్లు, స్ట్రక్చర్డ్ డ్రెస్సులు , చక్కగా కుట్టిన అవుట్‌ఫిట్‌లు  రూపాన్ని మరింత ప్రత్యేకంగా నిలుపుతాయి. తల నుండి కాలి వరకు ఒకే రంగులో మోనోక్రోమ్ లుక్ ధరించడం వల్ల  స్టైల్ మరింత ప్రీమియంగా కనిపించవచ్చు. అయితే, ఒకే రంగులో విభిన్న టెక్స్చర్‌లు ఉన్న ఫ్యాబ్రిక్‌లను ఉపయోగించడం మరింత అట్రాక్షన్  రూపాన్ని సృష్టిస్తుంది. ఒక స్ట్రక్చర్డ్ బ్యాగ్, బెల్ట్, పాయింటెడ్ షూస్, బంగారు ఆభరణాలు, సన్‌గ్లాసెస్ లేదా ఒక స్టేట్‌మెంట్ యాక్సెసరీ ఒక సాధారణ అవుట్‌ఫిట్‌ను కూడా వేరే లెవల్ లో చూపిస్తాయి.  అతిగా యాక్సెసరీలను ధరించడానికి బదులుగా, తక్కువ , సరైన యాక్సెసరీలను ఎంచుకోవడం మంచిది.

 షూస్.  ఫ్లాట్స్..  

 మొత్తం లుక్ లో  షూస్ , ప్లాట్స్  కూడా ఒక ముఖ్యమైన భాగం. శుభ్రంగా , చక్కగా ఉన్న షూస్  మరింత స్టైలిష్‌గా కనిపించేలా చేస్తాయి, అయితే పాతబడిన లేదా మురికిగా ఉన్న షూస్  దుస్తుల మొత్తం అందాన్ని తగ్గిస్తాయి.

                                                                                                                                                  *రూపశ్రీ.