ఝుంఖ గాజుల... మజాకా...!

ఝుంఖ గాజుల... మజాకా...!


 

చేతికి గాజులు అందాన్నిస్తాయి. అలంకరణలో వాటిదే పైచేయి. రకరకాల రంగుల్లో మట్టిగాజుల నుంచి రాళ్ళ గాజుల దాకా సందర్భాన్ని బట్టి చేతికి చేరే గాజులు ఎప్పటికప్పుడు ట్రెండీగా మారిపోతుంటాయి. ఇప్పటి ట్రెండీ ఫ్యాషన్ ఏంటో తెలుసా... జుంకా గాజులు. ఈ గాజుల్ని మనకి నచ్చిన గాజులకి ఆ చివరా, ఈ చివరా బోర్డర్ గాజుల్లా వేసుకోవాలి. కిందకి వేలాడే జుంకాలతో అందంగా వుండే ఈ గాజులు రకరకాల రంగుల్లో, వెరైటీల్లో దొరుకుతాయి. పెళ్ళికి, పార్టీలకి కట్టుకునే చీర, లెహంగాలకి తగ్గట్టు చేతికి నిండుగా కనిపించే వీటిని వేసుకుంటే అటు సంప్రదాయంగా, ఇటు ట్రెండీగా కూడా వుంటుంది.

- రమ