మీ పిల్లలు రజస్వల కావడం లేదా?? అయితే తప్పకుండా తెలుసుకోవలసిన విషయమిది!!
posted on Feb 6, 2023
మీ పిల్లలు రజస్వల కావడం లేదా?? అయితే తప్పకుండా తెలుసుకోవలసిన విషయమిది!!
మహిళల్లో రజస్వల అవడం, ఋతుస్రావం అనేవి చాలా సాధారణమైన విషయాలు. అయితే.. కొందరిలో బుతుస్రావం కనబడకపోవడం మొదటి నుంచీ ఉంటే మరి కొందరిలో సడన్ గా ఆగిపోతుంది. కొందరు ఆడపిల్లలు యుక్తవయస్సు వచ్చినా రజస్వల అవరు. పైగా పొత్తికడుపు దగ్గర ఎత్తుగా తయారవుతుంది. అది చూసిన కొందరు ఆ అమ్మాయి గర్భవతి ఏమో అనుకుని పొరబడుతూ ఉంటారు. మహిళల్లో జరగవలసిన సహజ ప్రక్రియ అయిన ఈ రజస్వల కావడం తమకు జరగలేదని ఇలాంటి అమ్మాయిలు ఎంతో ఆందోళన చెందుతూ ఉంటారు.
‘క్రిప్టోమెనోరియా' అనే ఒక పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితిలో ఆ స్త్రీ ఎంతకీ రజస్వల అవడం ఉండదు. కాని కొంతకాలానికి పొత్తి కడుపు దగ్గర ఎత్తుగా ఎదుగుతుంది. తెలియనివారు దానిని చూసి గర్భిణీ అని కూడా 'కుంటారు
‘క్రిప్టోమెనోరియా' పరిస్థితిలో స్త్రీ నిండుగా ఉంటుంది. వక్షోజాలు పూర్తిగా వస్తాయి. రూపంలో ఎటువంటి తేడా ఉండదు. అయినా రజస్వల అయినట్లు కనబడదు. ఇటువంటి స్త్రీలు రజస్వల అవక పోవడం ఉండదు. రక్తస్రావం మాత్రం కనబడదు. దానికి కారణం యోనిద్వారం దగ్గర కన్నె పొర పూర్తిగా మూయబడి ఉంటుంది.
వీరిలో నెల నెలా బహిష్టులు అవడం ఉంటుంది.కాని రక్తస్రావం కనబడదు. వీరిలో కలిగేర రక్తస్రావము బయటకు రావడం కుదరక మర్మావయవాల లోపలే నిలువచేరి పోతుంది. అలా బహిష్టు రక్తం నిలవ చేరిపోవడంతో గర్భా శయం ఉబ్బుకు వస్తుంది.
మొదట్లోనే కన్నె పొర పూర్తిగా మూసి ఉంచిన పరిస్థితిని గుర్తించకపోతే 6-7 మాసాలంత గర్బిణీలాగా కనబడే అవకాశం లేకపోలేదు. ఇలా మూసి ఉంచిన కన్నె పొరని ఆప రేషను చేసి తొలగిస్తే లోపల పేరుకుని పోయిన రక్తమంతా బయటకు వచ్చేస్తుంది. కాన్పు అయిన కడుపులాగా అంతా తగ్గిపోతుంది.
కొందరు మొదట్లో నెల నెలా బహిష్టు మామూలుగా అవుతారు. ఆ తరువాత బహిష్టు రావడం ఆగిపోయి అంతు పట్టని రహస్యంగా మిగిలిపోతాయి. హార్మోన్ల లోపంవల్ల బహిష్టులు రాకపోవచ్చు. మానసిక ఒత్తిడి, ఆందోళన, మెంటల్ షాక్ వల్ల బహిష్టులు ఆగిపోవచ్చు. రక్తహీనత తీవ్రంగా ఉంటేకూడా బహిష్టులు వుండవు. పిట్యూటరీ గ్రంధి, ఎడ్రినల్ గ్రంధిలో కంతులు ఏర్పడితే బహిష్టులు రావు.
వయస్సు మళ్ళుతున్న స్త్రీలలో అకస్మాత్తుగా నెలసరి ఆగిపోయి తర్వాత శాశ్వతంగా బహిష్టులు ఆగిపోవచ్చు. సాధారణంగా ఈ పరిస్థితి 40-50 సంవత్సరాల వయస్సు వారికి కనబడుతుంది. ఇదే మెనోపాజ్. ఋతుస్రావం రావలసిన విధంగా నెల నెలా రావడం వుండక ఆగిపోవడాన్ని 'సెకండరీ ఎమెనోరియా' అంటారు. ఇటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు కొన్ని కేసుల్లో కారణం ఏదై నదీ అర్థం కాకుండా అవుతుంది. రోగి జననేంద్రియాల పరీక్ష, అల్ట్రాసౌండు ఎగ్జామినేషను, యం. ఆర్. ఐ, హార్మోన్ల పరీక్ష, ఇతర పరీక్షలు జరిపినప్పుడు ఎమెనోరియాకి కారణం తెలిసే అవకాశం ఉంటుంది.
ఏది ఏమైనా జననేంద్రియ సమస్యలు, మహిళల నెలసరి అనేవి చాలా సున్నితమైన అంశాలు. వీటి విషయంలో ఏదైనా సమస్య వస్తే దాన్ని సొంత వైద్యం లో పరిష్కరించుకోకుండా డాక్టర్ ను కలవడం ఉత్తమం.
◆నిశ్శబ్ద.