పిల్లలను చురుగ్గా ఉంచే ఆహారం?
posted on Jul 18, 2013
1. పాలు: మెదడుకు మరియు శరీరం కోసం శక్తిని అందించడానికి పాల ఉత్పత్తులు ప్రోటీన్ మరియు కాల్షియం బాగా సహాయపడుతాయి. పిల్లల్లో బ్రెయిన్ టిష్యుష్ అభివృద్ధికి మరియు పిల్లల్లో బలమైన ఎముకల పెరుగుదలకు మరియు బలమైన దంతాలను పొందడానికి పాలు బాగా సహాపడుతాయి.
2. గుడ్లు: గుడ్లు ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. మరియు వీటిలో సహజంగా కాల్షియం శరీరం గ్రహించడానికి సహాయపడే విటమిన్ డి ఇందులో ఉంటుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో పిల్లలకు ఒక గ్లాసు పాలతో పాటు గుడ్డును అంధించడం వల్ల వారు సంతృప్తికరంగా అనుభూతిని కలిగి ఉండటమే కాదు ఎక్కువ సమయంలో కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది ఈ పోషకాంశం.
3. పండ్లు: వివిధ రకాల పండ్లలో ఏ పండైనా సరే పిల్లలకు ఆరోగ్యకరమే. పిల్లలు పండ్లు తినడం వల్ల పిల్లలకు అవసరం అయ్యే విటమిన్స్ మరియు మినిరలల్స్ పుష్కలంగా అందుతాయి. మరియు పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మరియు ఇవి పిల్లలను చురుకుగా ఉంచుతుంది. మరి పుష్కలమైన న్యూట్రీషియన్స్ పొందడానికి అన్ని రకాల పండ్లను పిల్లలచేత తినిపించండి.
4. ఓట్ మీల్: కొన్ని పరిశోధనల ప్రకారం ఓట్ మీల్ తిన్న పిల్లలు పాఠశాలలో మంచి ఏకాగ్రతను పొందుతున్నారు. అదేవింధంగా అన్నింట్లోను దృష్టి సారిస్తున్నారు. అని కనుగొన్నారు. ఫైబర్ అధికంగా ఉండే తృణధాన్యాలు అంటే ఓట్ మీల్, ఇవి చాలా తేలికగా మరియు నిదానంగా జీర్ణం అవుతాయి. దాంతో పిల్లల్లో ఎక్కువ సమయం శక్తి స్థిరంగా ఉండటానికి ఈ ఆహారాలు సహాయపడుతాయి.
5. పెరుగు: బలమైన ఎముకలు మరియు దంతాలను రూపొందించడానికి పెరుగులోని క్యాల్షియం, ఇతర పోషకాంశాలు బాగా సహాపడుతాయి. అంతే కాదు, పెరుగు తేలికగా జీర్ణం అవ్వడానికి మరియు పేగులో చెడు బ్యాక్టీరియాను నివారించడానికి ఇవి బాగా సహాపడుతాయి. కాబట్టి లోఫ్యాట్ పెరుగును తీసుకొని, వారికి ఇష్టమైన పండును చేర్చి అంధించండి.
6. ఆకుకూర: ఐరన్, క్యాల్షియం, మరియు ఫోలిక్ యాసిడ్ మరియు విటమిన్ ఎ అండ్ సి పోషకాంశాలను కలిగిన ఒక అద్భుతమైన ఆహారం ఆకుకూరలు. ఆకుకూరలు పెద్దలకు మాత్రమే కాదు పిల్లల బ్రెయిన్ మరియు బోన్ పెరుగుదలకు బాగా సహాయపడుతాయి.
7. తృణధాన్యాలు: తృణధాన్యాలను బ్రెడ్ మరియు ఇతర చిరుధాన్యాలలో చూడవచ్చు. పిల్లలు సాధారణంగా ఇటువంటి ఆహారాలను బాగా ఎంజాయ్ చేస్తారు. వీటిలో ఫోలిక్ ఆమ్లం, ఇనుము, జింక్ మరియు B విటమిన్లు మరియు అలాగే కొన్ని విటమిన్ డి మరియు కాల్షియం సమృద్ధిగా ఉన్నాయి. పిల్లలకు ఇటువంటి ఆహారాలను(తృణధాన్యాలతో తయారు చేసిన ఆహారాలను) ముఖ్యంగా బ్రెడ్ మరియు పాస్తా వంటివి ఇవ్వడాన్ని మొదలు పెట్టండి.
8. నట్స్: పిల్లల ఆరోగ్యకరమైన పెరుగుదలకు మరియు అభివృద్ధి కోసం, అలాగే గుండె ఆరోగ్యానికి అవసరం అయ్యే మంచి ఫ్యాట్స్(కొవ్వు) ను కలిగి ఉంటాయి. పిల్లలకు రోజూ ఉదయం చిన్న మొత్తంలో ఇటువంటి కొవ్వు పదార్థాలను అంధించడం వల్ల వారికి తగినంత శక్తిని పొందుటకు వారు పెరుగుదలకు అన్నివిధాల బాగా సహాయడుతాయి.