మీకేం నప్పుతాయో తెలుసా
posted on May 21, 2014
మీకేం నప్పుతాయో తెలుసా?
మీ రూపురేఖలును బట్టి ఆభరణాలు ఎంచుకుంటే అందంగా కనిపిస్తారు. అంటూ నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటో చూద్దాం!
1. ఆభరణాలను ఎంచుకునే ముందు మెడ పొడవు, చెవులు తీరు ఎలా వుంది వంటి వంటి విషయాలని దృష్టిలో పెట్టుకోవాలిట. ఉదాహరణకి కోలముఖం వారికీ అన్ని రకాల నగలు నప్పుతాయట. జుంకాలు, స్టడ్స్, ఇలా నచ్చిన వెరైటీ పెట్టేయొచ్చు వీళ్ళు.
2. అదే ముఖం పొడవుగా ఉండేవారికి నుదురు పెద్దగా ఉండేవారికి వేలాడే వాటికంటే దిద్దులు వంటివి బాగా నప్పుతాయి హూప్స్ కూడా చక్కగా ఉంటాయి.
అలాగే పెద్ద పెద్ద హారాలు కాక చిన్న చెయిన్లు లాంటివి, చోకర్లులా మెడకి దగ్గరగా ఉండేవి బావుంటాయట. ఇక నాలుగు పలకలుగా వుండే వెడల్పాటి ముఖం కలిగిన వారు స్పైరల్స్, స్టడ్స్,వంటివి బావుంటాయి.
అలాగే పొడవైన హారాలు కూడా బాగా నప్పుతాయి. ఇక గుండ్రని ముఖాకృతి ఉన్న వారికీ మెడ పట్టేసినట్టు ఉండేవి కాక పొడవాటి చెయిన్లు హారాలు బావుంటాయి. అలాగే చెవులకి సెలక్ట్ చేసుకున్నేటప్పుడు కూడా చాల జాగ్రత్తగా సెలక్ట్ చేసుకోవాలి. మరీ వేలాడేవి వీరికి అంతగా నప్పవు ఇలా కొంచం శ్రద్దగా నప్పే ఆభరణాలని ఎంచుకుంటే చూడచక్కగావుంటారు ఎవరైనా అంటున్నారు నిపుణులు.
-రమ.