Read more!

ముఖ సౌందర్యాన్ని పాడు చేసే బ్లాక్ హెడ్స్

 

ముఖ సౌందర్యాన్ని పాడు చేసే బ్లాక్ హెడ్స్

మామూలుగా ఏ స్త్రీ లేదా పురుషుని అందాన్ని గురించి మాట్లాడేటప్పుడు ముఖాన్ని గురించి ముందుగా ప్రస్తావిస్తారు. ముఖమే ఎవరి అందానికైనా కొలబద్దగా ఉంటుంది. అందమైన ముఖానికి చక్కటి ముక్కు ఒక ఆకర్షణగా నిలుస్తుంది. కాని ఈ అందమైన నాసికా సౌందర్యాన్ని తగ్గిస్తాయి బ్లాక్ హెడ్స్. మిగిలిన వారిలో కూడా ఇది కనిపించినా, ప్రధానంగా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. వీటివల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోయినా ఇవి చికాకును తెప్పిస్తాయి. ఎంతో అందమైన ముఖం వున్నా వీటి వల్ల ఇబ్బందిగానే ఉంటుంది.

ముఖ్యంగా ఇవి ఒకసారి తీసేసినా పడే పడే వస్తూ ఉంటాయి. దీని వల్ల మానసికంగా కొంచెం దిగులు ఏర్పడుతుంది. పడే పడే అద్దంలో వీటిని చూసుకుంటూ ఉండటం కంటే తీసివేసే మార్గాన్ని చూడటం ఉత్తమం. వీటి నివారణోపాయం ఏమిటంటే బ్యూటీషియన్ దగ్గరకు వెళ్ళి వాటిని తగిన విధంగా తీసి వేయించుకుంటూ ఉండటం. ఇప్పుడు బ్లాక్ హెడ్స్ తీసివేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి.

బ్యూటీ పార్లర్ లో లేదా స్వంతంగా వారానికి రెండు సార్లు ముల్తానా మట్టి ప్యాక్ వేయించుకోవడం ఒక పధ్ధతి మరో పధ్ధతి ఏమిటంటే రోజూ మర్చి రోజు రాత్రి పూట నిద్రపోయే ముందు ట్రెటినాయిన్ ను పల్చగా ముక్కుకు తాసుకోవడం. దీని అలాగే ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల ముక్కు పై భాగంలో ఏర్పడే సన్నని పొరలు తొలగిపోతాయి. అక్కడి చర్మం ప్రకాశవంతంగా , అందంగా తయారవుతుంది. ఈ కారణం వల్ల బ్లాక్ హెడ్స్ రావడం బాగా తగ్గిపోతుంది.

బ్యూటీ పార్లర్ కు వెళ్ళే విషయంలో కొంత పరిశీలన అవసరం. అనుభవం ఉన్న బ్యూటీషియన్ దగ్గరకు మాత్రమే వెళ్ళాలి. బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేయడానికి కొంచెం నైపుణ్యం అవసరం . పరిశుభ్రతను పాటించే బ్యూటీ పార్లర్ లను ఎంచుకోవాలి. బ్యూటీ పార్లర్ కు వెళ్ళడం కొంత ఖరీదైన వ్యవహారం కాబట్టి నెలకు ఒకసారి వెళ్ళినా సరిపోతుంది.

కొంతమందికి ముక్కు చుట్టూ బ్లాక్ హెడ్స్ తో పాటుగా వైట్ హెడ్స్ కూడా వస్తాయి. అయితే ఇవి రావడం చాలా అరుదుగా జరుగుతుంది. వీటిని నివారించాలంటే ఆస్ట్రిన్జెంట్ లోషన్ లో దూదిని ముంచి, ముక్కు చుట్టూ రాసుకుంటే సరిపోతుంది. దీంతో వైట్ హెడ్స్ రావడం తగ్గిపోతుంది.