చిటికెలో బెడ్ లాంప్ తయారీ ఎలా?
posted on Aug 29, 2013
మాములుగా పడుకునే సమయంలో బెడ్ లాంప్ లాంటివి ఆన్ చేసి పడుకోవడం మనం రోజు చేసే పని. ఒకవేళ మన ఇంట్లో బెడ్ లాంప్ లేకుంటే? లేదంటే మీరు వాడె బెడ్ లాంప్ మీకు నచ్చకపోతే ? షాప్ కి వెళ్లి కొత్త బెడ్ లాంప్ కొని తెచ్చుకుంటారు అంతే కదా! దీనివల్ల డబ్బులు వృధా అయినట్లే.
ఒకవేళ మీ ఇంట్లోని వస్తువులతోనే... మీకు నచ్చినట్లుగా బెడ్ లాంప్ ను డిజైన్ చేసి తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది. ఒకసారి ఆలోచించండి !.
మరి ఇంకెందుకు ఆలస్యం ఈ క్రింది విధంగా బెడ్ లాంప్ ను తయారు చేసుకోండి. మరి ఈ బెడ్ లాంప్ ను ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా...!
కావలసిన వస్తువులు :
ఒక మీడియం సైజ్ వాటర్ బాటిల్, ప్లాస్టిక్ చెంచాలు (స్పూన్స్), బల్బు, కట్టర్, అంటించడానికి కావలసిన వస్తువు(ఫెవికోల్, హీటర్ లాంటివి).
తయారు చేయు పధ్ధతి :
ముందుగా చెంచాల యొక్క స్టిక్ భాగాన్ని కట్ చేసుకోవాలి. అదే విధంగా బాటిల్ యొక్క కింది భాగాన్ని సమానంగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక్కొక్క చెంచాను పైన ఫోటోలో చూపించినట్లుగా హీటర్ తో అతికించుకుంటూ డెకరేట్ చేయాలి. ఇలా పూర్తిగా చేసిన తర్వాత పైన బాటిలో యొక్క మూత (క్యాప్) కు రంద్రం చేసి, దాని నుండి వైర్ ను తీసి బల్బును అమర్చుకోవాలి. ఆ తర్వాత ఆ క్యాప్ ను ఆ బాటిల్ కు బిగించేసి.. ఆ బాటిల్ ను మీకు కావలసిన ప్రదేశంలో తగిలించుకొని, బల్బు కు కరెంట్ కనెక్షన్ ఇస్తే బెడ్ లాంప్ వెలుతురుతో అదిరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీ గదిలో ఇలాంటి బెడ్ లాంప్ ను మీరే తయారుచేసి పెట్టుకోండి.