ఇలా నేర్పించండి

ఇలా నేర్పించండి

 

 

ప్రతి పేరెంట్ కల ఒక్కటే తమ పిల్లలు చక్కగా హ్యాపీగా ఏదగాలని మంచి పొసిషన్ లో వుండాలని వాళ్ళు అందరితో శబాష్ అనిపించుకోవాలని ప్రతి పేరెంట్ కల అదే. మనం చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు అయితే మనం పిల్లలతో వ్యవహరించే తీరును బట్టి వుంటుంది అని అంటున్నారు చిట్టి విషు ప్రియ గారు.
         పిల్లలని అర్ధం చేసుకుంటూ వారికీ అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా మనం పేరెంట్ మరియు అడల్ట్స్ అని కూడా గుర్తుపెట్టుకోవాలి. పసి పిల్లలు కాబట్టి వారికీ కొన్ని నేర్పించాల్సి వస్తుంది ఒకసారి కొంచెం బుజ్జగించాల్సి వస్తుంది. ఇంకోసారి కటినంగా మాట్లాడాల్సి వస్తుంది. దీనిని ఒక పేరెంట్ గా బాలన్స్ చెయ్యాలి. ములితంగా చక్కగా కలుపుకుంటూ ఉండాలి. సడన్ గా ఒక్కసారి కన్ను ఎర్ర చేసి వాళ్ళు వినగానే హక్కున చేర్చుకోవడం లాంటిది ములితం అంటే. వారికి నీడలాగ పక్కన వుండాలి. పిల్లల ఇష్టాలు తెలుసుకోవాలి ఎందుకు మాటి మాటికి ఈ డ్రెస్ వేసుకుంటున్నావ్ అని అడగ కుండ అసలు ఎందుకు ఆ డ్రెస్ నే ఇష్టపడుతుందో తెలుసుకోవాలి.
             2 సంవత్సరాల వయస్సు నుండే వారికీ ప్రతిది నేర్పించాలి ఆడుకున్న తరువాత తన వస్తువులు తమ బాగ్స్ లో పెట్టుకోవటం, ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టడం లాంటివి నేర్పించాలి ఆలాగే తిన్న తరువాత తమ ప్లేట్ మీరు తీసుకోకుండా తమతో ఆ ప్లేట్ పక్కన పెట్టించాలి ఇలా చిన్న చిన్న పనులుకి అలవాటు పడి ఒక హబిట్ గా మారిపోతుంది. మరి కొంత మంది పిల్లలు మొండిగా ఉంటారు ఏ పని చెప్పిన చెయ్యరు . అటువంటి పరిస్థితిలో ఏం చెయ్యాలంటే 'ఛాలెంజ్' అనే మాట గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అటువంటి పిల్లలో నేను సాధించాలి అనే తపన వారిలో క్రియేట్ అవుతుంది అమ్మ కన్నా ముందు నేను చెయ్యాలి అనే తాపాత్త్రయం వాళ్ళలో మొదలవుతుంది.
            టైం మేనేజ్మెంట్ అనేది కూడా పిల్లలకి నేర్పించాలి ఇది 4th or 5th క్లాసు నుండి ప్రారంబించాలి అప్పుడైతే పిల్లలకి అర్ధం అవుతుంది. వాళ్ళ ని ఎక్కువ ఒత్తిడికి గురి చేయకుండా నెమ్మదిగా వర్క్ చేయడం నేర్పించాలి. ఇది ఒక అలవాటు గా మారిపోతుంది మీరు చెప్పకుండానే వాళ్ళ వర్క్స్ కంప్లీట్ చేసుకుంటారు. ఇది ఒక పెద్ద భారంగా కూడా అనిపించదు ఎంజాయ్ చేస్తూ పనిని ముగిస్తారు  అని మంచి మాట అనే కార్యక్రమంలో చిట్టి విష్ణు ప్రియ గారు చెబుతున్నారు.