చర్మం ముడతలు, తెల్ల జుట్టుకు ఈ హార్మోన్ల లోపమే కారణమట..!
posted on Mar 1, 2025
చర్మం ముడతలు, తెల్ల జుట్టుకు ఈ హార్మోన్ల లోపమే కారణమట..!
చర్మం యవ్వనంగా ఉండాలని, జుట్టు ఎప్పటికీ నల్లగా ఉండాలని కోరుకోని వారు ఎవరూ ఉండరు. దీనికి కారణం ఇలా ఉంటే ఎప్పటికీ వయసు మీద పడినట్టు కనిపించదు. కానీ కొంతమందికి దురదృష్ట వశాత్తు చిన్న వయసులోనే చర్మం ముడతలు పడటం, జుట్టు తెల్లగా మారడం కనిపిస్తుంది. అయితే ఇలా జరగడానికి శరీరంలో హార్మోన్ల లోపమే అని వైద్యులు, పరిశోధకులు చెబుతున్నారు. అసలు ఏ హార్మోన్లు లోపించడం వల్ల చర్మం అలా ముడతలు పడటం, జుట్టు తెల్లగా మారడం జరుగుతుంది? ఈ హార్మోన్ల లోపం రాకూడదు అంటే ఏం చేయాలి? పూర్తీగా తెలుసుకుంటే..
చర్మం వృద్దాప్యానికి లోను కావడంలో, ముడతలు పడటంలో హార్మోన్లు చాలా కీలక పాత్ర పోషిస్తాయట. చర్మం ఎక్కువగా సూర్యరశ్మికి గురికావడం, కాలుష్యం, శరీరంలో వ్యర్థాలు ఎక్కువగా ఉండటం మొదలైన కారణాల వల్ల కూడా చర్మం ముడతలు పడే అవకాశం ఉంటుంది ఇన్సులిన్ లాంటి గ్రోత్ ఫ్యాక్టర్, గ్రోత్ హార్మోన్.. ఈస్ట్రోజెన్లు, మెలటోనిన్ వంటి హార్మోన్లు చర్మాన్ని ప్రభావితం చేస్తాయి.
మెలటోనిన్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడుతుంది, చర్మ కణాల మరమ్మత్తుకు సపోర్ట్ ఇస్తుంది. మెలటోనిన్ భవిష్యత్తులో యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ లో భాగంగా మారవచ్చని వైద్యులు, పరిశోధకులు అంటున్నారు.. ఎండోకన్నబినాయిడ్స్ (CBD ఉత్పత్తులలో కనిపిస్తాయి), ఆక్సిటోసిన్ (లవ్ హార్మోన్) చర్మాన్ని సూర్యుడి కాంతి నుండి దెబ్బతినకుండా రక్షించగలవని, కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
చర్మం వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేయడంలో సహాయపడే 8 హార్మోన్లు..
గ్రోత్ హార్మోన్:
కణజాలాలను మరమ్మతు చేయడంలో, దృఢమైన చర్మం కోసం కొల్లాజెన్‌ను నిర్వహించడంలో సహాయపడుతుంది.
ఈస్ట్రోజెన్లు:
ముఖ్యంగా రుతుక్రమం ఆగిన మహిళల్లో చర్మ ఆర్ద్రీకరణ, స్థితిస్థాపకతను మెరుగుపరుస్తుంది.
రెటినోయిడ్స్ (రెటినోల్, ట్రెటినోయిన్):
చర్మ కణాల పునరుద్ధరణను పెంచుతాయి, ముడతలను తగ్గిస్తాయి.
మెలటోనిన్:
చర్మాన్ని UV నష్టం నుండి రక్షిస్తుంది, కణాల మరమ్మత్తుకు మద్దతు ఇస్తుంది.
ఆక్సిటోసిన్:
మంటను తగ్గించి, మెరిసే చర్మాన్ని ప్రోత్సహిస్తుంది.
ఎండోకన్నాబినాయిడ్స్:
CBD ఉత్పత్తులలో కనిపిస్తాయి, ఇవి చర్మం ఒత్తిడి, కాలుష్యం నుండి కోలుకోవడానికి సహాయపడతాయి.
α-మెలనోసైట్-స్టిమ్యులేటింగ్ హార్మోన్:
చర్మపు పిగ్మెంటేషన్‌ను పెంచుతుంది, సూర్యరశ్మి దెబ్బతినకుండా రక్షిస్తుంది.
*రూపశ్రీ.
