చిన్నారులకు ఆహారపు అలవాట్లు

చిన్నారులకు ఆహారపు అలవాట్లు

మీ చిన్నారులకు ఆహారం ఎలా ఇవ్వాలి అనే ఆలోచనతో సతమతమవుతున్నారా? మొదటగా చిన్నారులకు కొత్తగా ఘన ఆహారం మొదలు పెట్టినప్పుడు అది బాగా మెత్తగా చేసి ఇవ్వాలి. అలా రోజు పెడుతూ చిన్నారులకు ఆహారపు అలవాటుగా మార్చాలి. ఒకవేళ చిన్నారులు ఏ ఆహారాన్ని అయినా ఇష్టపడకపోతే.. అలాంటివి పెట్టకుండా జాగ్రత్తపడాలి .

చిన్నారులకు ఆహారంతోపాటు బాగా కాచి చల్లార్చిన నీరు కూడా తాగించడం మంచిది. ముఖ్యంగా చిన్నారులకు ఆహారంగా అన్నంలో ఉడికించిన బంగాల దుంప ,నెయ్యీతో మెత్తగా చేసిన ఆహారాన్ని పెడితే బాగా ఇష్టపడి తింటారు. అరటిపండును కూడా బాగా ఇష్టపడి తింటారు. అదేవిధంగా గోధుమ, రాగి, బియ్యంపిండి, కందిపప్పు ,నెయ్యీ ,నూనే తో ఉడికించిన మెత్తని ఆహార పదార్థమేదైనా ఇవ్వడం మంచిది.

ఆరు నుండి తొమ్మిది నెలల పిల్లలకు మెత్తని అన్నం, పప్పుతో పాటు కూరగాయలు కూడా ఇవ్వడం మంచిది. పిల్లలు పెరిగేకొద్దీ ఇడ్లి ,ఉప్మా ,పొంగలి ,మజ్జిగ ,అన్నం ,పాయసం ,మొదలైనవి పెట్టడం మంచిది .ఇలా ఏ వయసుకు తగ్గట్టు అలా ఆహారం పెట్టడం వల్ల వారిలో శారీరక పెరుగుదల కూడా ఎక్కువగా వుంటుంది .