మీ దగ్గర మ్యాక్సీ స్కర్ట్ ఉందా.. ఈ టాప్స్ తో మీ రూపమే మారిపోతుంది!

మీ దగ్గర మ్యాక్సీ స్కర్ట్ ఉందా?  ఈ టాప్స్ తో మీ రూపమే మారిపోతుంది!


 ఫ్యాషన్ ప్రపంచంలో కొన్ని వస్త్రాలు ఎప్పటికీ ట్రెండ్ నుండి బయటకు వెళ్లవు, వాటిలో మ్యాక్సీ స్కర్ట్ ఒకటి. ఇది సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా, చాలా సొగసుగా ఉంటుంది. అంతకంటే  మల్టీ పర్పోస్ వేర్ గా కూడా సహాయపడుతుంది.   కాలేజీకి వెళ్లినా, ఆఫీస్ మీటింగ్‌కైనా, స్నేహితులతో కాఫీ డేట్‌కైనా, లేదా పార్టీకి వెళ్లాలన్నా మ్యాక్సీ స్కర్ట్ చాలా బాగా సెట్ అవుతుంది.  ఈ స్కర్ట్ అన్ని సందర్భాలలో స్టైలిష్ గా కనిపించేలా చేస్తుంది. చాలా మంది మహిళలు మ్యాక్సీ స్కర్ట్‌లను కొనుగోలు చేసినప్పటికీ, వాటితో ఏ టాప్‌ను జత చేయాలనే విషయంలో చాలా ఇబ్బంది పడుతుంటారు. సరిగా మ్యాచ్ కాని  టాప్‌ను ఎంచుకోవడం వల్ల  మొత్తం లుక్  పాడైపోతుంది. కానీ స్కర్ట్ లోకి మంచి టాప్ సెలెక్ట్ చేసుకుని ధరించినప్పుడు.. మహిళలు ఎంతో ఆత్మవిశ్వాసంగా కనిపిస్తారు.  మ్యాక్సీ స్కర్ట్ కు ఏ టాప్స్ బాగుంటాయో తెలుసుకుంటే..

ఫ్యాషన్ నిపుణుల అభిప్రాయం..

మ్యాక్సీ స్కర్ట్‌తో ఎల్లప్పుడూ  శరీర పైభాగాన్ని సమతుల్యం చేస్తూ, నడుము ఆకృతిని స్పష్టంగా చూపించే టాప్‌ను ఎంచుకోవాలని ఫ్యాషన్ నిపుణులు చెబుతున్నారు. ఫిట్టెడ్ షర్టులు, బేసిక్ టీ-షర్టులు, పెప్లమ్ టాప్‌లు, వెస్ట్‌కోట్‌లు , ఆఫ్-ది-షోల్డర్ టాప్‌లు ఈ రోజుల్లో సోషల్ మీడియాలో,  స్ట్రీట్ ఫ్యాషన్‌లో బాగా ప్రాచుర్యం పొందాయి. మ్యాక్సీ స్కర్ట్‌ను కొత్తగా , స్టైలిష్‌గా మ్యాచ్ చేయాలనుకుంటే కింది ఫ్యాషన్ గైడ్  చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఫ్లోయీ మ్యాక్సీ స్కర్ట్‌తో బేసిక్ టీ-షర్ట్..

వదులుగా ఉండే మ్యాక్సీ షర్ట్ ఉంటే, వేసవి కాలంలో దాన్ని చాలా స్టైలిష్‌గా , సౌకర్యవంతంగా ధరించవచ్చు. ఈ రకమైన స్కర్ట్ కాలేజీకి, కాఫీ డేట్‌కి, ప్రయాణానికి లేదా వీకెండ్ ట్రిప్ కు  చాలా అనువుగా ఉంటుంది. కానీ ఈ స్కర్ట్‌కు ఏ టాప్ జత చేయాలో  అర్థం కాకపోతే, చాలా సింపుల్‌గా ఉండే టాప్‌ను ఎంచుకోవాలి.  ఒకవేళ ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియకపోతే ఒక సాధారణ తెల్లటి టీ-షర్టు , వదులుగా ఉండే మ్యాక్సీ స్కర్ట్ చాలా కంఫర్ట్ గానూ, స్టైలిష్ గానూ ఉంటుంది.

పెప్లమ్ టాప్‌తో మ్యాక్సీ స్కర్ట్..

పెప్లమ్ టాప్స్ నడుమును హైలైట్ చేస్తూ, శరీరాకృతిని మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి.  మ్యాక్సీ స్కర్ట్ వదులుగా ఉంటే, దానితో పెప్లమ్ టాప్ చాలా బాగుంటుంది. ఇది బ్రంచ్ డేట్, షాపింగ్ , ఫ్యామిలీ మీటింగ్స్  వంటి సందర్భాలకు చక్కటి లుక్ ఇస్తుంది.

ఆప్-ద- షోల్డర్ టాప్స్..

పార్టీకి లేదా డేట్ నైట్‌కి సిద్ధమవుతున్నట్లయితే, స్కర్ట్‌తో పాటు   ఆఫ్-షోల్డర్ టాప్‌ను ఎంచుకోవచ్చు. ఒకే  రంగు స్కర్ట్ ఉంటే, దానితో నలుపు లేదా ఎరుపు రంగు టాప్ ధరిస్తే బాగుంటుంది.  ఈ లుక్‌ను పూర్తి చేయడానికి స్టేట్‌మెంట్ చెవిపోగులను జోడిస్తే బాగుంటుంది.  హై హీల్స్ లుక్ ను మరింత మెరుగుపరుస్తాయి. ఈ రకమైన శైలి  ట్రెండ్రీ గా, అట్రాక్షన్ లుక్ ను ఇస్తుంది.  అలాగే ఇది ఫోటోస్ కు మరింత అద్బుతంగా కనిపిస్తుంది.

ఫార్మల్ షర్డ్ తో..

ఈ రోజుల్లో ఆఫీస్ ఫ్యాషన్‌లో మ్యాక్సీ స్కర్ట్, షర్ట్ కాంబినేషన్  బాగా ప్రాచుర్యం పొందుతోంది.  లుక్ స్టైలిష్‌గా కనిపించడానికి  షర్ట్‌ను కొద్దిగా ప్యాంటులోపలికి టక్ చేసుకోవాలి. దీనితో పాటు బెల్ట్ వాడాలి.  అలాగే, న్యూడ్ లేదా బ్లాక్ హీల్స్ ధరించాలి.  ఆఫీసు, మీటింగ్స్  లేదా వృత్తిపరమైన కార్యక్రమాలకు ఇది మంచి లుక్ గా నిలుస్తుంది.  

వెస్ట్ కోట్ తో శాటిన్ మ్యాక్సీ షర్డ్..

 పవర్ డ్రెస్సింగ్ ఇష్టమైతే, వెస్ట్‌కోట్ , శాటిన్ మ్యాక్సీ స్కర్ట్ కాంబినేషన్ తప్పకుండా ట్రై చేయాల్సిందే. ఇది పాతకాలపు రిచ్  ఫ్యాషన్ రూపాన్ని ఇస్తుంది కాబట్టి ట్రెండ్‌లో ఉంది. చాలా నాజూకుగా, గ్రాండ్ గా కూడా  కనిపిస్తుంది. సోషల్ మీడియాలో దీనికి ఆదరణ రోజురోజుకీ పెరుగుతోంది.

శరీరాన్ని బట్టి స్కర్ట్ స్టైలింగ్..

 పొట్ట ముందుకు పొడుచుకుని ఉంటే, హై-వేస్టెడ్ మ్యాక్సీ స్కర్ట్‌ను ఎంచుకోవాలి. దానిని పెప్లమ్ టాప్‌తో జత చేయాలి. ముదురు రంగులను ఎంచుకోవాలి.

 పొట్టిగా ఉన్నవాళ్లు మోనోక్రోమ్ లుక్‌ను ఎంచుకోవాలి. హై-వేస్టెడ్ స్కర్ట్‌ను ఎంచుకుని, దానికి ప్లాట్‌ఫామ్ హీల్స్‌ను జత చేయాలి.

 శరీరాకృతి బొద్దుగా ఉంటే, శరీరానికి అతుక్కుపోయే టాప్స్ ధరించాలి. మరీ వదులుగా ఉండే టాప్స్‌ను ధరించడం మానుకోవాలి.

ఈ  మిస్టేక్స్ చేయకండి..

ఓవర్‌సైజ్డ్ స్కర్ట్‌ను ఓవర్‌సైజ్డ్ టాప్‌తో ధరించకూడదు.

మరీ పొడవుగా ఉండి నేల మీద ఈడ్చుకుపోయే స్కర్టులను ఎంచుకోవద్దు.  

ఒకే దుస్తులలో చాలా ప్రింట్లను కలపవద్దు.

తప్పుడు పాదరక్షలు మొత్తం రూపాన్ని పాడుచేస్తాయి. కాబట్టి పాదరక్షల ఎంపిక కూడా జాగ్రత్త వహించాలి.

                                *రూపశ్రీ.