మీకు జుట్టు రాలే సమస్య వేధిస్తోంటే అసలు కారణం ఇదే కావ్చచు!
posted on Apr 5, 2023
మీకు జుట్టు రాలే సమస్య వేధిస్తోంటే అసలు కారణం ఇదే కావ్చచు!
ఇప్పటికాలంలో అమ్మాయిలు జుట్టు రాలడమనే సమస్యతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సరైన కారణాన్ని తెలుసుకోకుండా కనిపించిన మార్గమల్లా ఫాలో అవ్వడంతో కేవలం జుట్టు రాలే సమస్య కాస్తా జుట్టు పలుచగా, సున్నితంగా మారిపోవడానికి, జీవం కోల్పోవడానికి కారణం అవుతుంది. అయితే దీనికి అసలు కారణం.. కారణానికి తగిన పరిష్కారం తెలుసుకుంటే..
శరీరంలో కొన్ని విటమిన్లు మరియు మినరల్స్ లోపించడం వల్ల వివిధ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాంటి సమస్యల్లో ఒకటి జుట్టు రాలడం. ఈ రోజుల్లో చాలా మంది జుట్టు రాలడం గురించి ఫిర్యాదు చేస్తున్నారు. రోజురోజుకూ తమ జుట్టు పల్చబడి పొడిబారడంతోపాటు చిట్లిపోతుందని కూడా కొందరు ఫిర్యాదు చేస్తున్నారు. పరిష్కారాలను వెతుక్కుంటూ చాలామంది బ్యూటీ ప్రొడక్ట్స్, షాంపూల వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ, కొన్నిసార్లు, శరీరంలో ఇదొక్కటి తగినంత మొత్తంలో లేకపోవడం వల్ల జుట్టురాలిపోవడం జరుగుతుంది. మీ గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం నుండి శరీరంలో వివిధ రకాల విధులను సజావుగా నిర్వహించడం వరకు సహాయపడేది ఇదే.. ఇంత ప్రముఖ పాత్ర పోషించే పదార్థమే ఒమేగా-3 ఫ్యాట్స్..
జుట్టు రాలే సమస్య బాగా ఎదుర్కొంటుంటే లేదా మీ జుట్టు పలుచబడటం లేదా పొడిగా, పెళుసుగా ఉన్నట్లు అనిపిస్తే, ఒమేగా-3 తీసుకోవడం గురించి ఆలోచించాల్సిందే.. ఒమేగా-3 కొవ్వులు చర్మంలో తేమను నిలుపుకోవడంలో సహాయపడతాయి, అవి జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి. జుట్టు చక్కగా.. అందంగా, మందంగా లేకపోతే ఒమేగా-3 శరీరానికి తగిన మోదాదులో అందడం లేదని అర్థం. ఇలాంటి పరిస్థితిలో తప్పనిసరిగా తినవలసిన ఆహారాలను ఆరోగ్య నిపుణులు సూచించారు. నెయ్యి, ఆలివ్ నూనె, బాదం, వాల్‌నట్‌లు, అవిసె గింజలు, చియా విత్తనాలు ఒమేగా-3 పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు.
ఇవి మాత్రమే కాకుండా.. ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం జుట్టు రాలడాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. మొత్తం జుట్టు నాణ్యతను పెంచుతుంది. ఒమేగా-3 అధికంగా ఉండే ఆహారాలు కాకుండా, మీ జుట్టుకు మంచి చేసే ఇతర ఆహారాలు.. గుడ్లు, బచ్చలికూర, గింజలు, నల్ల శనగలు, అవకాడోలు మరియు ఆకుపచ్చ ఆకు కూరలు మొదలయినవి.
◆ నిశ్శబ్ద