నాన్నకి పిల్లలకి అనుబంధం పెరగాలంటే
posted on Jun 20, 2015
నాన్న పాత్ర మారిపోయింది..ఒకప్పుడు గంబీరంగా ..ఇంటి పెద్ద అనే పాత్రలో నిలబడిన నాన్న , ఈ రోజు అమ్మలా లాలించటం నుంచి స్నేహితుడుగా పక్కన నిలిచే దాక తన పాత్ర పోషణ ఎంతో మారిపోయింది. మారిన జీవన శైలి నాన్ ని అమ్మ పాత్రలోకి తెస్తే, అమ్మా, నాన్న పాత్రల సమన్వయంలో నాన్న కొంచె౦ ఇబ్బంది పడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకు కారణం అమ్మలు అని కూడా గోషిస్తున్నాయి .
తను పిల్లలకి దగ్గరగా లేని సమయం లో పిల్లల ఆలనా పాలన భర్త కి అప్పచెప్పి నప్పుడు ఆ పనులు అతని వీలుగా చేయనివ్వకుండా , పిల్లలకి ప్రతి ఒక్కటి తను చేసి నట్టే , అతను కూడా చేయాలనీ, వాళ్ళని తను డీల్ చేసినట్టే చేయాలని కోరుకోవటం, అతనికి పదే పదే అదే చెప్పటం తో అటు తండ్రిగా పిల్లలతో కొంచం గట్టిగా ఉంటూనే, తల్లిగా మారి వారితో అనుబందం కొనసాగించే క్రమం లో వత్తిడి కి గురి అవుతున్నట్టు చెబుతున్నారు అద్యయన కర్తలు.
అందుకే అమ్మలకి ఒక సూచన చేస్తున్నారు. నాన్నలని , నాన్నలుగా వుండ నివ్వండి, మీరు చేసే పనులు చేసినా , అది వారి స్టైల్ లో వారు చేస్తే ..అమ్మకి , నాన్నకి వుండే తేడా పిల్లలు చక్కగా అర్ధం చేసుకుంటారు. లేదంటే పాత్ర పోషణలో నాన్న వత్తిడి ప్రభావం పిల్లల మీద కూడా పడే అవకాసం వుంది. అది తండ్రి, పిల్లల అనుబంధాన్ని ప్రబావితం చేస్తుంది. అంటున్నారు వారు.
అమ్మలూ ...నాన్న కి పిల్లలకి మద్య ఏ మాత్రం వెళ్ళకుండా , వారిని అలా వదిలేయటమే వారిమధ్య అనుబందం పెరగటానికి మీరు చేయవలసిన పని . అని ముక్త కంఠం తో చెబుతున్నారు అద్యయన కర్తలు. సో Happy Father's Day రోజున మీ శ్రీవారికి తండ్రిగా స్వేచ ని బహుమతి గా ఇచ్చేయండి.
.......రమ