ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించే ఫ్యాషన్...

ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించే ఫ్యాషన్...

 

 

నేటి యువత ఫ్యాసన్లకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది. నలుగురిలోనూ ప్రత్యేకంగా...ఆకర్షణీయంగా కనిపించాలనే కోరికలే ఫ్యాషన్ల వైపు మరలిస్తోంది. మరి ఫ్యాషన్లకు సంబందించి ఈ నాడు మార్కెట్లో బ్యూటీ ప్రాడక్ట్స్ మొదలు కొని బట్టలు, చెప్పులు, రిస్ట్ వాచీలు, హెయిర్ మేకప్ ప్రొడక్ట్ ఇలా రకరకాలుగా అందుబాటులోకి వచ్చేసాయి. ఫ్యాషనబుల్ గా ఉత్పత్తులను తయారు చేయడానికి వివిధ రంగాలు ముందుకొస్తున్నాయి. ప్రతి విషయంలోనూ ఫ్యాషన్ కు అలవాటు పడుతూ వయస్సు పైబడినవాళ్ళు కూడా యవ్వనంగా కనపడటానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. తమ అందాన్ని మెరుగుపరచడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వాటికోసం బ్యూటీపార్లర్లు, మసాజ్ సెంటర్లు, ప్రారంభమైనాయి. పోటీ పడి కొత్త కొత్త పద్దతులను అనుసరిస్తూ యూత్ ను ఫ్యాషన్ వైపుకు నెడుతున్నాయి. ఇక దుస్తుల విషయంలో ఫ్యాషన్ బాగా ప్రాచుర్యం పొంది... రోజుకో కొత్తరకం పుట్టుకొస్తున్నాయి. చూపరులను భ్రమింప చేస్తున్నాయి. ఫ్యాషన్ దుస్తులను బట్టి అందం, ఆకర్షణ, పెరుగుతుంది. దుస్తుల ఎంపిక విషయంలో దృష్టి పెట్టకపోతే అవి మనిషి అందాన్ని తగ్గించి వేస్తాయి. ఫ్యాషన్ దుస్తులు ధరించే వారు సులభంగా ఎదుటివారిని ఆకర్షింపబడుతారు. కాబట్టి మనం వెసుకున్న బట్టలు ఎదుటివారి చూపులను కొల్లగొట్టగలగాలి. అలాంటి దుస్తులను ఎంపిక చేసుకొని ఫ్యాషన్ గా కనిపించడానికి ప్రయత్నించాలి. లావుగా ఉండే వారు ముదురు రంగు దుస్తుల కన్నా లేత రంగు దుస్తులు ఉపయోగించాలి. దాని వల్ల లావుగా వున్నా చూపరులకు డ్రెస్ మీద కాన్సన్ ట్రేషన్ ఎక్కువగా ఉండి మిమ్మల్ని సన్నగా ఉన్న భ్రమ కలిగిస్తుంది. పొట్టిగా ఉండే వారు చారల దుస్తులు, పొడుగ్గా ఉండేవారు అడ్డచారల దుస్తులు ధరిస్తే పొట్టివారు పొడుగ్గాను, పొడుగువారు పొట్టిగాను కనిపిస్తారు. నిజానికి వారిలో ఎటువంటి మార్పు ఉండదు. కానీ చూపరులకు ఆకర్షించగలుగుతారు.