ముఖాన్ని యవ్వనంగా,  ప్రకాశవంతంగా ఉంచే సీరమ్ ఇది..!

 ముఖాన్ని యవ్వనంగా,  ప్రకాశవంతంగా ఉంచే సీరమ్ ఇది..!

 


ప్రతి అమ్మాయి తన ముఖ చర్మం ప్రకాశవంతంగా,  యవ్వనంగా ఉండాలని కోరుకుంటుంది.  దీని కారణంగానే మార్కెట్లో బోలెడు రకాల ఫేస్ క్రీములు,  స్ప్రేలు, ఫేస్ ప్యాక్ లు, సీరమ్ లు అందుబాటులో ఉంటున్నాయి. అయితే ఇవన్నీ రసాయనాలతో కూడినవి కావడం వల్ల ఇవి వాడితే కలిగే ఫలితాలు తాత్కాలికంగా ఉంటే.  వీటిని మానేసినప్పుడు ముఖ చర్మం మునుపటికంటే దారుణంగా ఉంటుంది.  కానీ ముఖ చర్మాన్ని ఇంటి పట్టునే ఆరోగ్యంగా,  యవ్వనంగా, కాంతివంతంగా మార్చే సీరమ్ ఉంది. దీన్ని స్వయానా చర్మ సంరక్ష నిపుణులే రికమెండ్ చేస్తన్నారు.  ఈ సీరమ్ ఏంటో.. దీన్నెలా తయారు చేయాలో తెలుసుకుంటే..


కావలసిన పదార్థాలు..


కొబ్బరినూనె

అలోవెరా జెల్


పసుపు

విటమిన్-ఇ క్యాప్సూల్


తయారీ విధానం..


పైన చెప్పుకున్న పదార్థాలను అన్నింటిని ఒక చిన్న కంటైనర్ లో వేసి బాగా మిక్స్ చేయాలి.  దీన్ని ప్రతిరోజూ ముఖానికి పట్టించి 2 నుండి 3 నిమిషాలు ముఖానికి మసాజ్ చేయాలి. ఇలా చేస్తుంటే ముఖం కోల్పోయిన కాంతిని తిరిగి పొందుతుంది. ఇది ముఖంపై మచ్చలు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.  మార్కెట్లో దొరికే రసాయనాలతో నిండిన సీరమ్ లకు బదులు దీన్ని వాడితే చర్మానికి ఎలాంటి హాని ఉండదు.  ఇది మాత్రమే కాకుండా ఇంటి పట్టున తయారుచేసుకోగలిగిన మరొక ఫేస్ సీరమ్ కూడా ఉంది.  అదెలా తయారుచేసుకోవాలి అంటే..

కావలసిన పదార్థాలు..

 విటమిన్-సి క్యాప్సూల్స్.. 2
 
 విటమిన్ ఇ  క్యాప్సూల్.. 1

రోజ్ వాటర్..  2 స్పూన్లు

కలబంద జెల్.. 1 టీస్పూన్

గ్లిసరిన్.. 1 టీస్పూన్

ఒక చిన్న కంటైనర్

తయారు చేసే పద్ధతి..

ముందుగా ఒక గిన్నెలో అలోవెరా జెల్,  రోజ్ వాటర్ కలపాలి.  అందులో 2 క్యాప్సూల్స్ విటమిన్ సి,  1 క్యాప్సూల్ విటమిన్ ఇ కలపాలి. చివరగా గ్లిజరిన్ వేసి  బాగా   మిక్స్ చేయాలి.  ఈ మిశ్రమాన్ని ఒక కంటైనర్ లో నిల్వచేసుకోవాలి.  దీన్ని  వారం పాటు రిఫ్రిజిరేటర్‌లో ఉంచవచ్చు.

ఎలా ఉపయోగించాలి..


 రాత్రి లేదా పగటిపూట నిద్రపోయే ముందు  ఈ  సీరమ్‌ను ముఖంపై అప్లై చేయవచ్చు. అయితే దీనికి ముందు ముఖాన్ని కడుక్కోవాలి.  తర్వాత  టోనర్‌ను అప్లై చేసి ఆ తరువాత సీరమ్‌ను అప్లై చేయాలి.  2 నుండి 3 నిమిషాల తర్వాత ఫేస్ క్రీమ్ రాసుకోవచ్చు.  దీన్ని   డే స్కిన్ కేర్‌లో అప్లై చేస్తే సన్‌స్క్రీన్ కూడా అప్లై చేయాలి.


                                              *రూపశ్రీ.