చలికాలంలో ఇలా డై కాఫీ స్క్రబ్ వాడి చూడండి.. మెరిసిపోతారు..!


చలికాలంలో ఇలా డై కాఫీ స్క్రబ్ వాడి చూడండి.. మెరిసిపోతారు..!


చలికాలం వచ్చిందంటే చాలు.. చర్మ సంరక్షణ పెరుగుతుంది. దీనికి తగ్గట్టే మార్కెట్ లో చర్మ సంరక్షణ ఉత్పత్తుల కొనుగోళ్లు కూడా పెరుగుతాయి.  ఈ కాలంలో చర్మాన్ని కాపాడుకోవడానికి సాధారణం కంటే ఎక్కువ సమయం కేటాయించాలి.  అయితే ఇంట్లోనే ఈజీగా చలికాలంలో చర్మ సంరక్షణ కోసం డై కాఫీ స్క్రబ్ తయారుచేసుకోవచ్చు.  ఇదెలా తయారు చేయాలో.. దీని కోసం కావలసిన పదార్థాలు ఏంటో తెలుసుకుంటే..

ముఖ చర్మాన్ని లోతుగా  క్లీన్ చేయడానికి కాఫీని ఉపయోగించడం చాలా బెస్ట్ ఆప్షన్.  ఇది చనిపోయిన చర్మ కణాలను సమర్థవంతంగా తొలగించడంలో సహాయపడుతుంది.  అందుకే చలికాలంలో ఇది బాగా ఉపయోగపడుతుంది.

కాఫీ స్క్రబ్ ఎలా చేయాలి?

కాఫీ స్క్రబ్ కు కావలసిన పదార్థాలు..

కాఫీ పొడి.. 1 స్పూన్..

తేనె.. కొద్దిగా..

ఒక స్పూన్ కాఫీ పొడిని తగినంత తేనెతో కలిపి పేస్ట్ లా చేయాలి. దీన్ని ముఖానికి పట్టించి సుమారు 20 నిమిషాల పాటు ముఖానికి మసాజ్ చేయాలి.  తరువాత సాధారణ నీటితో ముఖాన్ని కడిగేయాలి. ముఖం మీద ఉబ్బిన కళ్లు, చర్మం ముడతలు, ముఖం వాడినట్టు ఉండటం వంటి అన్ని  సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

కాఫీ, పాలతో..


కాఫీ, తేనె తో మాత్రమే కాదు.. కాఫీ, పాలతో కూడా ముఖాన్ని మెరిపించవచ్చు. కాఫీ పొడిలో పాలు కొద్దిగా వేసి చిక్కగా  చేసుకోవాలి. ఈ పేస్ట్ తో ముఖాన్ని మసాజ్ చేసుకోవాలి.  ఇది చర్మంలో మురికిని తొలగిస్తుంది.  ముఖానికి మెరుపును ఇస్తుంది.  

కాఫీ, పెరుగు..

కాఫీ, పెరుగు కాంబినేషన్ కూడా ముఖానికి చాలా మంచి చిట్కా.  1 టీస్పూన్ పెరుగులో కాసింత కాఫీ పొడి, అందులోనే చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. దీన్ని ముఖానికి రాసి 20 నిమిషాలు మసాజ్ చేసుకోవాలి. తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.  అందంగా, మృదువుగా ఉన్న చర్మం సొంతమవుతుంది.


కాఫీ, నిమ్మరసం..

కాఫీ, నిమ్మరసం స్ర్కబ్ తో ఇన్స్టంట్ గ్లో తీసుకురావచ్చు. ఇది నిజంగా మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. కాఫీ పొడిలో కాస్త నిమ్మరసం పిండి దీన్ని ముఖానికి పట్టించి బాగా మసాజ్ చేయాలి.  తరువాత ముఖాన్ని సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి.


కాఫీ, అలోవెరా..

కాఫీ పౌడర్ లో అలోవెరా జెల్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ తో ముఖాన్ని మసాజ్ చేసుకోవాలి. 20 నిమిషాల తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.  ఇది ముఖాన్ని మెరిపిస్తుంది.


                                       *రూపశ్రీ.