వెరైటీ సాక్స్ ల లుక్కే వేరు
posted on Apr 23, 2015
వెరైటీ సాక్స్ ల లుక్కే వేరు
సాక్స్ లంటే స్కూల్ పిల్లలు వేసుకునే వన్న అభిప్రాయం ఎప్పుడో పోయింది. షూస్ తోనే కాదు చెప్పులతో కూడా ఇవి ఎప్పుడో జతకట్టాయి. చిన్న పిల్లల నుంచి టీనేజ్ అమ్మాయిలు, అమ్మలు, చివరికి బామ్మలు కూడా ఈ సాక్స్ వేసుకోవటానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే వారి వారి అవసరాలకి, ఫాషన్ కి తగ్గట్ట్టు వాటిని రూపొందిస్తున్నారు కాబట్టి... కేవలం రంగు రంగులే కాదు పువ్వులు, పక్షులు, జంతువులు, ఫన్ని మెస్సేజులు తో ఎన్నో రకాల సాక్స్ లు... మార్కెట్ లో దొరుకుతున్నాయి.
1. అలాగే టో సాక్స్ లని, ఏ వేలికా వేలు విడివిడిగా కదిలించేందుకు వీలుగా రూపొందించారు. ఇవి కాలేజీ అమ్మాయిలకి ఎంతో నచ్చే వెరైటీ.
2. రిఫ్లేక్సాలజి సాక్స్ ల గురించి విన్నారా ?...ఇవి వేసుకుంటే మసాజ్ చేసుకోవటం సులువు. మడమలో ఒకో ప్రాంతం శరీరంలోని ఒకో భాగానికి ప్రతీకలుగా నిలుస్తుంది. ఆ ప్రాంతాలని సులువుగా గుర్తించేందుకు ఈ సాక్సులు ఉపయోగ పడతాయి.
3. అందంగా కనిపించే లేస్ తో చేసిన సాక్స్ లు, వేసే డ్రెస్ బట్టి డిజిటల్ ప్రింట్స్ తో ఆకర్షణీయం గా కనిపించే ఎన్నో రకాల సాక్స్ లుని ఇప్పుడు అమ్మాయిలు ఇష్టపడుతున్నారు.
4. ఇప్పుడు లేటెస్ట్ గా మెసేజ్ సాక్స్ లు దొరుకుతున్నాయి. వీటి ద్వారా డిఫరెంట్ లుక్ తో పాటు మెసేజ్ కూడా ఇచ్చినట్టుంటుంది. మరి మీరు కూడా ఓపిగ్గా షాపింగ్ చేసి ఈ వెరైటీ సాక్స్ లని కోనేయండి...
-రమ