వాహ్.. చలికాలంలో కొబ్బరి పాలు ఇలా వాడితే.. మెరిసిపోతారు..!

వాహ్.. చలికాలంలో కొబ్బరి పాలు ఇలా వాడితే.. మెరిసిపోతారు..!

 


చలికాలం చర్మానికి పరీక్షా కాలం.  చలికాలంలో వచ్చే సమస్యల వల్ల చర్మం చాలా దెబ్బతింటుంది.  చర్మం పొడిబారి పగుళ్లు ఏర్పడుతుంది.  చర్మం పొలుసులుగా లేస్తుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే నొప్పి, మంట కూడా పెడుతుంది.  చలికాలంలో ముఖ్యంగా పొడిచర్మం ఉన్నవారికి,  సున్నితమైన చర్మం ఉన్నవారికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.  అయితే కొబ్బరి పాలను వాడితే చలికాలంలో చర్మం సాఫ్ట్ గా మారడమే కాకుండా కాంతివంతంగా మెరిసిపోతుందట.


కొబ్బరి పాలు  చర్మానికి చాలా లోతుగా తేమను అందిస్తాయి.  ఈ కారణంగా పొడి చర్మం ఉన్నవారు కొబ్బరిపాలు రాసుకుంటే చర్మం పొడిబారడం తగ్గుతుంది.  చర్మం మృదువుగా మారుతుంది.  రోజులో ఒకసారి అయినా కొబ్బరి పాలను ముఖానికి రాస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.


చలికాలంలో చర్మానికి సోప్,  ఫేస్ వాష్ కఠినమైన క్రీములు రాయడం వల్ల చర్మం దెబ్బతినడమే కాకుండా చర్మం నల్లగా కూడా మారుతుంది.  ముఖ్యంగా మార్కెట్లో కొనుగోలు చేసే మాయిశ్చరైజర్ క్రీములు, లోషన్లు చర్మాన్ని డార్క్ గా మారుస్తాయి. కానీ కొబ్బరి పాలను ఉపయోగించడం వల్ల చర్మం మెరుస్తుంది.  కాంతివంతంగా మారుతుంది.


కొబ్బరి పాలలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి.  ఇవి చర్మం చికాకును, మంటను తగ్గించడంలో సహాయపడతాయి.  సున్నితమైన చర్మం ఉన్నవారికి కొబ్బరిపాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.


మొటిమలు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వంటి సమస్యలు ఉన్నవారికి కొబ్బరి పాలు మేలు చేస్తాయి.  చర్మాన్ని లోతుగా తేమగా ఉంచడమే కాదు. చర్మాన్ని లోతుగా శుభ్ర పరుస్తుంది కూడా.  కొబ్బరి పాలలో ఉండే పోషకాలు నల్ల మచ్చలు,  తెల్ల మచ్చలు, మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి.

కొబ్బరిపాలలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చిన్న వయసులోనే వృద్దాప్యాన్ని దరికి రానివ్వవు. చర్మాన్ని ముడుతలు, గీతల నుండి రక్షిస్తుంది.  చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది.


కొబ్బరి పాలను చలికాలంలో రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల చర్మం మెరిసిపోతుంది.  చర్మం తాజాగా ఉండేలా చేస్తుంది.  ముఖ్యంగా చలికాలం వల్ల ఏర్పడే అసౌకర్యం రానివ్వదు.  


                                            *రూపశ్రీ.