తల్లులు... మీ పిల్లల పసితనం ఆచూకీ ఏమన్నా తెలుసా మీకు

తల్లులు... మీ పిల్లల పసితనం ఆచూకీ ఏమన్నా తెలుసా మీకు ??

టైమ్  అయిన్ధి లేస్తావా? ...స్నానం చేశావా? తొందరగా తిను...కానీ బయల్దేరు ...హోం వర్క్ అయింధా ? లేట్ ఔతోంది పడుకో !! ఈ మాటలు ఎక్కడో  విన్నట్టు.. కాధు రోజు అన్నట్టు ఏమన్నా అనిపిస్తోంధా?? ఏ అమ్మ డిక్షనరీ లో ఐనా  మొదటి పజీలో ఉండే పదాలు. వీటి అర్ధం అందరింట్లో ఒక్కటే,పిల్లలు టైమ్ కి అన్నీ చేయాలని. క్రమశిక్షణ గా ఉండాలని ,మంచి పిల్లలు అనిపించుకోవాలని . అన్నీ టైమ్  ప్రకారం చేస్తున్నారు సరే మరి ఎప్పుడైనా టైమ్ ఆఫ్ ఇవ్వాలిగా ?? అది ఎక్కడ ?? ,మీతో మాట్లాడాలని ఉన్న,ఆట్లాడాలని ఉన్న , చివరికి పోట్లాడాలని ఉన్న వారికి మీరిచ్చిన టైమ్ టేబల్ లో సమయం ఎక్కడ కేటాయించారు ?? సాయంత్రం అయ్యేసరికి గుజ్జన గుళ్ళు కట్టుకుని ఆడుకునే  చిన్నతనం ఈ స్కూల్ టైమ్ ల వల్ల ఎప్పుడో మాయం అయిపోయింది. మరి మిగిలిన ఆ కాస్త పసితనాన్ని మీరు మాయం చేస్తున్నారనిపింఛట్లేదా ?? అసలు  తల్లులతో వచ్చిన పెద్ద చిక్కే ఇధి ,అన్నీ టైమ్ ప్రకారం సరిగ్గా జరగాలంటారు. ఒకవేళ జరక్క పోతే అందరూ  మళ్ళీ తమనే తిడతారని, తప్పు పడతారని వారి భయం. నిజమే, పిల్లలు వల్ల ఏం తప్పు జరిగిన మొదట తప్పుపట్టేధి తల్లినే . కానీ ఇలా ఎన్నాళ్లు పక్కవారికోసం చుట్టాలని త్ర్హుప్తి పరచడం కోసం మీ పిల్లల టైమ్ టేబల్ ఫిక్స్ చేస్తారు ?? పసితనం అసలే చిన్నధైపోయి, చిన్నప్పుడే పెద్దవాళ్ళైపోతున్న ఇప్పటి పిల్లలకి తిరిగి చూసుకుంటే పసితనపు గుర్తులేవీ. అందుకే ఎప్పుడూ కాకపోయిన ఎప్పుడో ఒకసారి వారిని రొటీన్ లోనుంచి బయటపడనియ్యండి. మెల్లిగా లేవనివ్వండి, హాయిగా ఆడుకొనివ్వండి, స్కూల్ కి డుమ్మా కొట్టి మీరే సినిమాకి తీసుకెళ్ళండి.. (అప్పుడు మీకు చెప్పకుండా డుమ్మా కొట్టే పనే ఉండధు )పగలకొట్టనివ్వండి, పాడు చెయ్యనియ్యండి .

వద్దు అనే ముందు ఎందుకు వద్దో వివరించండి. ఒకవేళ వారు మీ వాదన కాదని వారి మాట చెప్తే, అందులో నిజం ఉంటే, వారి ఆలోచనకి విలువ ఇవ్వండి. అప్పుడు పెద్దయ్యక  కూడా ఈ సంభాషించుకునే ప్రక్రియ కొనసాగుతుంది. లేకపోతే చిన్నప్పుడు మీరు చెప్పింది వింటారు పెద్దయ్యాక వాల్లమాటే నేగ్గెల చేసుకుంటారు. పసితనం మహా అయితే ఒక నాలుగైదేళ్లు ఉంటుంది, వారి జీవితంలోని ఆ కాస్త సమయం వారికిచ్చేయ్యండి ప్లీజ్. మంచి చెడు చెప్పండి, మంచెదో చెడేదో మీరే డిసైడ్ చేసేయకండి. తల్లులకె నా ఇది? తండ్రులకి ఈ మాట వర్తించాదా? అంటే వర్తించదు,.ఎంధుకంటే పిల్లలతో ఎక్కువ కాలం ఉండేడి, వారి జీవితాన్నిగమనాన్ని  నిర్ధారించేది తల్లే కాబట్టి. కనుక ".మా బంగారు తల్లులు... దయచేసి మీ పిల్లల పసితనం ఆచూకీ వారికి చూపించండి "...బాల దినోత్సవ శుభాకాంక్షలు.

--Pushpa