Read more!

స్ట్రీట్ షాపింగ్.. అదిరిపోయే కలెక్షన్స్

షాపింగ్ అంటే నచ్చని వాళ్ళు ఎవరుంటారు? అందులో లేడీస్ గురించి వేరే చెప్పక్కర్లేదు. అలా ఏదో పని మీద బయటికి వెళ్ళినప్పుడో లేదా అవసరానికి కొందామని వెళ్ళినపుడు ఏదైనా అట్రాక్టివ్ గా కనిపిస్తే ఇంకా టెంప్ట్ కాకుండా ఉండగలమా చెప్పండి. సాధారణంగా ఆడవాళ్ళకి ఎన్ని ఉన్నా ఇంకా ఏదో కావాలి లేదా మ్యాచ్ అవ్వలేదు అని అనిపిస్తూ ఉంటుంది. ఈసారి వెళ్ళినప్పుడు  కొందామని ప్లాన్ చేసుకుంటాం. కానీ కొన్నిసార్లు అనుకోకుండా కూడా షాపింగ్ చేస్తాం. అయితే మనం సాధారణంగా చేసే షాపింగ్ ఎక్కువగా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. సరదాగా టైం పాస్ కి షాపింగ్ చెయ్యాలి అనుకున్నప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ లేదా స్ట్రీట్ షాపింగ్ ని ప్రిఫర్ చేసుకుంటాము. ఎందుకంటే ఇందులో వెరైటీ కలెక్షన్స్ ఉంటాయి. అందుబాటు ధరల్లో దొరుకుతాయి. అంతే కాకుండా వెస్ట్రన్ వేర్, ఇండో వెస్ట్రన్, అందమైన ట్యాంక్ టాప్స్, ఫ్రాక్స్, నీ లెన్త్ ఫ్రాక్స్, ఈవెనింగ్ గౌన్స్, జాకెట్స్ ఇలా రకరకాల వెరైటీస్ తో రకరకాల కలర్స్ లో దొరుకుతాయి.

మన పర్సనాలిటీని, మన స్కిన్ టోన్ ని బట్టి మనకి నప్పే దుస్తులను మనం ఎంపిక చేసుకుంటాం. టాప్స్.. స్కర్ట్స్ లేదా జీన్స్ మీద  మ్యాచ్ చూసుకొని వేసుకోవచ్చు అదిరిపోతుంది. చిన్న బర్త్ డే పార్టీలకు లేదా వీకెండ్ ఔటింగ్స్ కి ఇవి పర్ఫెక్ట్ గా సూట్ అవుతాయి. ఈ స్ట్రీట్ షాపింగ్ లో ఒక్కోసారి టాప్ బ్రాండెడ్ వి కాపీ వెర్షన్స్ కూడా దొరుకుతాయి. ఒరిజినల్ కి ఏ మాత్రం తీసిపోవు అంటే నమ్మండి. కాకపోతే కాపీ వెర్షన్స్ కొనేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసి తీసుకోవాలి. లేదు అంటే దొరికిపోతాం(కాపీ అని తెలిసిపోతుంది).

బట్టలతో పాటుగా మ్యాచ్ అయ్యే చెప్పులు, బ్యాగ్స్, జ్యువలరీ, హెయిర్ యాక్ససరీస్ ఇలా చాలా వెరైటీస్ మనం షాపింగ్ చేసుకోవచ్చు. మన హైదరబాద్ లో చాలా ప్లేసెస్ లో స్ట్రీట్ షాపింగ్ చేసుకోటానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అమీర్ పేట్, కోఠి, ఓల్డ్ సిటీ, బేగం బజార్, సికింద్రాబాద్-జనరల్ బజార్… ఒక్కో ఏరియాలో ఒక్కో వెరైటీ అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం షాపింగ్ చేసేయండి.