చలికాలంలో ప్రాణా ఔషదాన్ని పెంచే సీతాఫలాలు

చలికాలంలో ప్రాణా ఔషదాన్ని పెంచే సీతాఫలాలు

సీతాఫలాన్నిఅమృతఫలం అనే కాకుండా కస్టర్డ్‌ యాపిల్‌ అనీ షుగర్‌ యాపిల్‌ అనీ పిలుస్తారు. ఇది చలికాలంలో మాత్రమే దొరుకుతుంది. ఈ ఫలాన్ని రసం రూపంలో కాకుండా నేరుగా తినడమే మంచిది. ఎందుకంటే గుజ్జు నోటిలోని జీర్ణరసాలను పెంచుతుంది. తద్వారా జీర్ణక్రియ వేగవంతమవుతుంది.

ఒక్కమాటలో చెప్పాలంటే ఈ పండులోని ప్రతి భాగం ఔషధమని చెప్పుకోవచ్చు.రోగనిరోధక శక్తిని ఇనుమడింపజేసే ఔషధ గుణగణాలు సీతాఫలంలో దాగి ఉన్నాయి. సీతాఫలం ఒక సంజీవని మాదిరిగా పని చేస్తుంది.

* ఎదిగే పిల్లలకు రోజూ ఒకటి, రెండు పండ్లు తినిపిస్తే మంచిది. బలవర్థకమే కాదు.. ఫాస్పరస్‌, క్యాల్షియం, ఇనుము లాంటి పోషకాలు.. ఎముకల పరిపుష్టికి తోడ్పడతాయి.

* సీతాఫలం పండు తింటే అజీర్తి మలబద్దకం తగ్గుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. నరాలు, కండరాలు బలహీనత గలవారికి ఈ పండు మంచి ఫోషకాహారం. చర్మవ్యాధులు తగ్గిపోతాయి.

* సీతాఫలంతో కొన్ని చిట్కాలు సీతాఫలంలోని గుజ్జును పాలతో కలిపి తాగితే శీరీరంలోని వేడి, అతి దాహం తగ్గుతాయి. జ్వరంగా ఉండి నాలు పిడచకట్టి ఒకటే దాహంగా ఉన్నప్పుడు సీతాఫలం గుజ్జును, పాలు కలిపిన మిశ్రమాన్ని ఇస్తే దాహ బాద తగ్గిపోతుంది.

* సీతాఫలం గింజల్ని పొడిచేసి తలకు రాసుకుంటే పేల సమస్య ఉండదు. మెదడుకు, నరాల వ్యవస్థకూ సీతాఫలం చాలా ఉపకరం అంటున్నారు.

* హృద్రోగులు, కండరాలు, నరాల బలహీనత ఉన్నవారు.. దీన్ని అల్పాహారంగా తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.