మూడ్ మన చేతుల్లోనే

మూడ్ మన చేతుల్లోనే


1. ఒక్కోసారి ఎంతో హుషారుగా, హాయిగా అనిపిస్తుంది. అంతలోనే తెలియని నిస్తేజం, ఎందుకిలా అని మనల్ని మనం ప్రశ్నించుకున్నా సమాధానం దొరకదు  షడన్ గా మూడ్ మారటం వెనుక నిజానికి కారణాలు అనేకం వుంటాయి . కాని మనకి అవి అప్పటికప్పుడు మనకి తెలియకపోవచ్చు, మనకు తెలియకుండానే ఎప్పటి సంఘటనలో మనసుపై ముద్ర వేసుకు...కూర్చుని ఆ సంఘటనని పోలిన సంఘటన ఎదురైనప్పుడు మనల్ని ప్రభావితం చేస్తుంటాయి.అందుకే నా మూడ్ ఇంతే ఎప్పుడెల ఉంటుందో  నాకే తెలియదు అని మీకు తరచూ అనిపిస్తుంటే ఒక్కసారి లోతుగా ఆ విషయం గురిచి ఆలోచించక తప్పదు.

2. ఎప్పుడెప్పుడు మన మనసు నిస్తేజం అవుతుందో  ఏ సంఘటనలు ఏ వ్యక్తులు ఎదురైనపుడు భాద కలుగుతుంది  వంటి విషయాలను  ముందు గమనించాలి  ఆ తర్వాత ఇలాంటి సంఘటనలు గతంలో  ఎప్పుడైనా  ఎదురైయ్యాయ అని చూడాలి ఇలా చుసినపుడు సమస్యకు కారణం దొరుకుతుంది.అప్పుడు  దాని పరిష్కారానికి ఆలోచించాలి.ఎందుకు ఆ సంఘటన  అంతగా ప్రభావితం చూపిస్తుంది. ఎందుకు మనల్ని అలజడికి గురిచేస్తుంది దాని నుంచి బయట పడేందుకు ఏంచేయాలి ఇలా అలోచించినపుడు  తప్పకుండ మనసు తేలిక పడుతుంది మనం ఏ విషయం చూసి భయపడుతున్నమో ఏది మనల్ని ఇబ్బంది పెడుతుందో దానినినేరుగా ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తే అది పలచబడి పోవడం మొదలుపెడుతుంది.

3.  చాలాసార్లు మూడ్ బాగాలేదంటు  విచారంగా ఒంటరిగా ఉండేవాళ్ళు ఆ మూడ్ లోంచి బయటపడేందుకు ప్రయత్నించరు దాంతో తిరిగి ఉత్సాహం నింపుకునెందుకు టైం పడుతుంది ఆ  ఉత్సాహం నింపుకున్న కాసేపటికే మళ్ళి ఏదోఒక కారణం విచారం నింపుకుంటారు ఈ సర్కిల్ నుంచి పక్కకి తప్పుకోవాలంటే ఒకటే  మార్గం మూడ్ బాగోలేదు అనిపించగానే మనసుని మళ్ళించుకోవటం ఇష్టమైన అంశాలతో , ఉత్సాహాన్ని నింపే విషయాలతో మనసుని నింపుకోవటం ఎప్పుడైతే ఈ ప్రయత్నం చేస్తామో కొన్నిరోజులకి అది అలవాటుగా మారుతుంది ఇకప్పుడు గంటలకి గంటలు  మూడ్ బాగాలేదంటూ విచారంగా ఉండం.

4.  అన్నిటికంటే ముఖ్యంగా గమనించాల్సింది మనసుకి ఉత్సాహాన్నిచ్చే అంశాలు ఏమిటన్నది గుర్తించడం, చాల సార్లు మనకి నచ్చని విషయాలు ఏమిటన్నది తెలిసినంత స్పష్టంగా మనకి నచ్చే విషయాలుఏమిటన్నది తెలియాదు. కాని మనకి మన మనసుకి ఉత్సాహనిచ్చే అంశాల పై అవగాహనా ఉన్నపుడు వాటిపై ఎక్కువ ఫోకస్ చేసినపుడు హఠత్తుగా వచ్చే మూడ్ స్వింగ్స్ తగ్గుతాయి మంచి విషయాలతో నిండిన మనసుపై నెగిటివ్ అంశాలు ఎదురైయినా పెద్దగా ప్రభావాన్ని చుపించలేవు.

5.  మన ఆలోచనల పై మనకి పట్టు ఉన్నపుడు ఈ మూడ్ స్వింగ్స్ మనల్ని ఇబ్బంది పెట్టవు అలాగే ఎవరిపైనా ప్రవర్తనపై ఆధారపడి మన మూడ్ మారటం అన్నది కరెక్ట్ కాదు కదా ! అందుకే చిన్న ఫిల్టర్ ఏర్పాటు చేసుకోవాలి మన మనసుకు ప్రపంచానికి మద్య ఆ ఫిల్టర్ ఏ  అంశాలని లోపలి పంపించాలో ఏవి వద్దో చూసుకుంటుంది, ఏమంటారు.