Home

»

Latest News

ఆస్కార్ రేసులో రామాయణ పార్ట్ 1 : ఇండిపెండెంట్ ఎంట్రీ!

Nov 11, 2026 10:33AM

దశరథ రాముడు, అయోధ్య రాముడు, సీతా రాముడు బాక్స్ ఆఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. దీంతో ఇప్పటి వరకు ఉన్న అనేక చిత్రాల రికార్డ్స్ జై శ్రీరామ్ అంటూ సైడ్ అవుతున్నాయి.

దీంతో రామాయణ పార్ట్ 1 సృష్టించబోయే  ఎండింగ్ రికార్డ్స్ ఎక్కడ ఆగుతాయో తెలియని పరిస్థితి. అలాంటి రామాయణ ఆస్కార్ అనే న్యూస్  తో అభిమానులు, భక్తుల ముఖాల్లో చిరు నవ్వులు చిందిస్తూ ఉంది. 

99వ అకాడమీ అవార్డ్స్ (ఆస్కార్ 2027) కోసం 'రామాయణ  చిత్రాన్ని స్వతంత్రంగా పరిశీలన నిమిత్తం సమర్పించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో మరాఠీ చిత్రం 'గొంధల్' భారత్ తరఫున అధికారిక ఎంట్రీగా బరిలో నిలిచినప్పటికీ, ఆస్కార్ నిబంధనల ప్రకారం ఇతర చిత్రాలు కూడా ఇండిపెండెంట్‌గా అకాడమీ రేసులోకి ప్రవేశించే అవకాశం ఉంది.

దీనికోసం అమెరికాలోని లాస్ ఏంజిల్స్ కౌంటీ, న్యూయార్క్ సిటీ, చికాగో వంటి ప్రముఖ నగరాల్లోని థియేటర్లలో నిర్దిష్ట నిబంధనలతో ప్రదర్శనలను విజయవంతంగా పూర్తి చేసుకుని, జనరల్ ఎంట్రీ కేటగిరీ కింద సినిమాను ఆస్కార్ బరిలో నిలిపారు. 

ఇది కూడా చదవండి:తెలుగులో చేసింది ఒక్క సినిమానే: కుర్రాళ్లని ఆగం చేస్తున్న హీరోయిన్!

ప్రపంచవ్యాప్తంగా 130కి పైగా దేశాల్లో, 17 డబ్బింగ్ భాషలలో సుమారు 10,000 స్క్రీన్లలో విడుదలైన రామాయణ ఇప్పుడు హాలీవుడ్ వేదికపై కూడా సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది. రాముడి పవిత్ర గాథను అంతర్జాతీయ స్థాయి దృశ్య రూపంలోకి తీసుకురావడమే కాకుండా, బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ ఆస్కార్ రేసులో నిలవడం భారతీయ చలనచిత్ర పరిశ్రమకు గర్వకారణంగా మారింది.

ఆల్రెడీ  ఆస్కార్ అవార్డు  విన్నర్స్  హన్స్ జిమ్మర్, ఏ.ఆర్. రెహమాన్ సంయుక్తంగా సంగీతం అందించడం మరో విశేషం.  రామాయణ వరల్డ్ వైడ్ గా ఇప్పటికి వరకు 800 కోట్లని రాబట్టింది.

మీకు నచ్చవచ్చు :దాదా ఫస్ట్ సాంగ్ వచ్చేస్తుంది: ఆ డేట్ స్పెషల్ ఇదే!
మీకు నచ్చవచ్చు: Rc 17 పై రిషి కాంత్ కీలక వ్యాఖ్యలు!

 

[Ramayana Part 1 Oscar Submission, Ramayana Part 1, Ranbir Kapoor Ramayana, Yash Ravana, Ramayana Oscar submission, Ramayana box office collection, Telug cinema news, Telugu Cinema, Tollywood, Tollywood News]


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com