Home

»

Latest News

ఎవరు ఊహించని జోనర్ లో సూర్య కొత్త మూవీ: ఇంకో బ్లాక్ బస్టర్ ఖాయమేనా!..టైటిల్ ఇదే! 

Nov 11, 2026 10:56AM

ఇప్పుడు హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అనే మూడు పదాలు సూర్య చుట్టూ నీ వెంటే నేను అన్నట్టుగా తిరుగుతున్నాయి. మరి హిట్ సినిమా ఎలా తియ్యాలో తెలియక సంవత్సరాలకి సంవత్సరాలే తీసుకుంటూ  కథలని ఫైనల్ చెయ్యని ఈ సినీ రోజుల్లో ఈ ఏడాది కరుప్పు( వీరభద్రుడు), విశ్వనాధ్ అండ్ సన్స్, సీన్ తో సెల్యులాయిడ్ ని మ్యాజిక్ చేసి పడేసాడు. మూడు చిత్రాలు కూడా డిఫరెంట్ జోనర్స్. ఈ కోవలోనే ఇప్పుడుసూర్య చేయబోతే మరో మూవీ జోనర్ ఆసక్తికరంగా మారింది. 

సూర్య ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈమూవీ షూటింగ్ దశలో ఉండగానే, ఆయన తదుపరి ప్రాజెక్ట్‌లకు సంబంధించిన ఆసక్తికరమైన వార్తలు సినీ వర్గాలలో చక్కర్లు కొడుతున్నాయి.   టీజే జ్ఞానవేల్ సినిమా తర్వాత, టాలెంటెడ్ డైరెక్టర్ మతిమారన్‌ పుగళేంది దర్శకత్వంలో సూర్య మరో కొత్త సినిమాను పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది.

ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక ముఖ్యమైన విశేషం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మతిమారన్‌ గతంలో తెరకెక్కించిన విమర్శకుల ప్రశంసలు పొందిన 'మండాడి' సినిమా మాదిరిగానే, ఈ తాజా చిత్రం కూడా పూర్తిగా సముద్ర నేపథ్యంలో సాగే ఒక పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. సముద్రపు అలల మధ్య జరిగే పోరాటాలు, నావికుల జీవితాలు, మరియు సముద్రపు మాఫియా నేపథ్యంలో ఈ కథ అత్యంత ఉత్కంఠభరితంగా సాగనుందని సినీ వర్గాలు అంటున్నాయి. మేకర్స్ ఒక పవర్ ఫుల్ టైటిల్‌ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 

సముద్రం మరియు నావికుల నేపథ్యంలో సాగే ఈ కథకు సరిగ్గా సరిపోయేలా 'పడగోట్టి' (అంటే నావికుడు) అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా సూర్య కెరీర్‌లో 49వ సినిమాగా (Suriya 49) అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుండటం విశేషం.

ఇది కూడా చదవండి:ఆస్కార్ రేసులో రామాయణ పార్ట్ 1 : ఇండిపెండెంట్ ఎంట్రీ!
 

 ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ టాలీవుడ్/కోలీవుడ్ నిర్మాణ సంస్థలలో ఒకరైన కలైపులి ఎస్‌. థాను నిర్మించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సముద్రపు బ్యాక్‌డ్రాప్, సూర్య మార్క్ యాక్షన్ ఎలిమెంట్స్, మరియు బలమైన భావోద్వేగాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

వరుస హిట్‌లతో జోరుమీదున్న సూర్య నుంచి వస్తున్న ఈ మా్యరిటైమ్ యాక్షన్‌ డ్రామా ఆయన అభిమానులకి, ప్రేక్షకులకి మరపురాని సినీ అనుభూతిని పంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.  

మీకు నచ్చవచ్చు: కోట శ్రీనివాసరావు గొప్ప యాక్టర్ ఎలా అయ్యారు!
మీకు నచ్చవచ్చు: నయనతారకి షాక్: ఇదేం ట్విస్ట్ అంట!

 

[Suriya And Mathimaaran Pugazhendi Movie Update, Suriya Padagotti Updates, Suriya new movie, Padagotti movie, Suriya 49, Mathimaran Pugazhendi, Telug cinema news, Telugu Cinema, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com