రాకింగ్ స్టార్ యశ్ హీరోగా దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ నటి కియారా అద్వానీ ‘నాదియా’ అనే సర్కస్ కళాకారిణి పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ చిత్రంలోని కొన్ని సన్నిహిత సన్నివేశాలపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ముఖ్యంగా పెళ్లి తర్వాత ఇలాంటి సన్నివేశాల్లో నటించడం ఏమిటంటూ కొందరు నెటిజన్లు కియారాను ట్రోల్ చేస్తున్నారు.
ఈ విమర్శల నేపథ్యంలో కియారాకు తన భర్త, బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా అండగా నిలిచినట్లు తెలుస్తోంది. ట్రోలింగ్‌పై సిద్ధార్థ్ ఎలా స్పందించారనే విషయాన్ని కియారానే స్వయంగా వెల్లడించారు. ఇతరుల వ్యక్తిగత జీవితాల గురించి విమర్శలు చేసేవారికి అసలు విషయాలు తెలియవని, అలాంటి కామెంట్లను పట్టించుకోవద్దని సిద్ధార్థ్ సూచించారట. సోషల్ మీడియాలో వచ్చే వ్యాఖ్యల కారణంగా మానసిక ప్రశాంతతను కోల్పోవాల్సిన అవసరం లేదని భార్యకు ధైర్యం చెప్పారట.
ఇది కూడా చదవండి: దాదా ధమాకా: డేట్ ఇదే.. ఫ్యాన్స్‌లో పూనకాలే.!
మరోవైపు నటి హుమా ఖురేషి కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. సినీ పరిశ్రమలో మహిళా నటుల విషయంలో ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు చూపించడం సరికాదని, ట్రోలింగ్‌ను ఆమె ఖండించారు. ఒక నటిగా వృత్తిపరంగా చేసే పనిని, వ్యక్తిగత జీవితాన్ని కలిపి చూడకూడదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ‘టాక్సిక్’లో కియారా పాత్ర, ఆమె నటన ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటాయో చూడాలి.
మీకు నచ్చవచ్చు: దీపావళి రోజే తుది శ్వాస.. రణవీర్ సింగ్ కుటుంబంలో తీవ్ర విషాదం.!
[Kiara Advani, Sidharth Malhotra, Toxic Movie, Yash Toxic Movie, Kiara Advani Romantic Scenes, Kiara Advani Trolling, Sidharth Malhotra Support Kiara, Geetu Mohandas, Huma Qureshi, Bollywood News]






